మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మణిశర్మ స్వరపరచిన 'లాహే లాహే' పాట యూట్యూబ్‌ను ఎంత షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ మరో మైలురాయిని చేరుకుంది.
60 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఈ సాంగ్‌ను పాడారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెల రెండో వారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం 12 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోతే ఆచార్య షూటింగ్ పూర్తయినట్లే. దీంతో గుమ్మడికాయ కొట్టేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతుంది.
#LaaheLaahe from #Acharya giving everyone some lovely vibes every time it is played
— BARaju's Team (@baraju_SuperHit) June 27, 2021
60M+ views & counting...
▶️ https://t.co/N7bdyKWKez
Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @sangithakrish #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/unrrfNOzSM
Comments
Please login to add a commentAdd a comment