
రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. త్వరలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్‌టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’(NMBK). సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చావ్ అబ్బాయి’పాట విడుదలైంది. ఈ పాటకు భాస్కరపట్ల లిరిక్స్ అందించగా, ధనుంజయ్, లిప్సిక అద్భుతంగా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కిరణ్ అబ్బవరం తనదైన స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు.