
మాస్ పాటైనా, క్లాస్ పాటైనా, భక్తి గీతమైనా.. అన్ని రకాల ట్యూన్స్‌తో అద్భుతాలు సృష్టిస్తాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఈయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్న ఈయన ఇప్పుడు చేతినిండా అవకాశాలు లేవని బాధపడుతున్నాడు. తనకు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులిస్తే బాగుండని ఆశపడుతున్నాడు. తాజాగా అతడు ఓ షోకి హాజరయ్యాడు.
ఈ సందర్భంగా మణి శర్మ మాట్లాడుతూ.. 'నేను మొదట వయొలిన్ నేర్చుకున్నాను. తర్వాత పెద్దదిగా కనిపించిందని కీబోర్డు నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇంతలో అనంత శ్రీరామ్.. 'మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్సులు పగలగొడతారంట కదా!' అని అడిగేశాడు. వెంటనే మణిశర్మ స్పందిస్తూ.. 'ఆ తమన్‌గాడు అబద్ధం చెప్పాడు. నా జీవితంలో ఒక్కసారే అలా చేశానులే' అని నవ్వేశాడు. తన కెరీర్‌లో ఎంతోమంది గొప్ప సెలబ్రిటీలతో కలిసి పని చేయడం అదృష్టమంటూ ఎమోషనలయ్యాడు. షో చివర్లో ఆయనకు సగౌరవంగా సన్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment