మనుషులకి ఆత్మలు ఉన్నట్టే.. ఓ ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. శివ కంఠమనేని హీరోగా నటించారు. మల్లి దర్శకుడు. మణిశర్మ సంగీతమందించారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు.
(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి రెండు కార్లు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్)
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్లో జరిగే కథ ఇది. రాజమండ్రి, మచిలీపట్నం,హైదరాబాద్‌లోని పలు అందమైన, ఆసక్తికరమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపామని దర్శకుడు చెప్పాడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?)
Comments
Please login to add a commentAdd a comment