ఎరుపు రంగులో వర్షం | Red Colour Water Rain in Tamil nadu | Sakshi
Sakshi News home page

ఎరుపు రంగులో వర్షం

Published Thu, Sep 26 2019 7:01 AM | Last Updated on Thu, Sep 26 2019 11:59 AM

Red Colour Water Rain in Tamil nadu - Sakshi

వంటపాత్రలో సేకరించిన వర్షపు నీరు

చెన్నై ,టీ.నగర్‌: కూడలూరులో ఎరుపు రంగులో వర్షం కరువడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నీటిని అధికారులు పరిశీలనకు తీసుకెళ్లారు. నీలగిరి జిల్లా, కూడలూరు సమీపంలో నాడుకాని గ్రామం ఉంది. దీని సరిహద్దు ప్రాంతాలైన నాడుకాని, ముండా, కూవత్తిపొళిల్‌లలో సోమవారం రాత్రి గంటకు పైగా వర్షం కురిసింది. ఈ వర్షపు నీరు ఎరుపు రంగులో ఉండడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. కొందరు నీటిని పాత్రల్లో, బాటిల్స్‌లో సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చి స్థానికులు సేకరించిన నీటిని వింతగా తిలకించారు. ఈ నీటిలో తడిసిన చాలా మందికి ఒంటిపై దురదలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ అధికారులు ప్రజలు బాటిళ్లలో సేకరించిన నీటిని పరిశోధనల కోసం తీసుకెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement