ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. 2017 కొత్త సంవత్సరంలో మొదటి ట్రేడింగ్ సెషన్ ఆరంభంలో పాజిటివ్ గా ఉన్నా..వెంటనే నెగిటివ్ గా మారిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో 26,569, నిఫ్టీ17 పాయింట్ల నష్టంతో 8,169వద్ద కొనసాగుతున్నాయి. రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలెండింగ్ రేటు కోతలు సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ మోదీ శనివారం నాటి ప్రకటన నేపథ్యంలో రియల్టీ అత్యధికంగా 2.3 శాతం జంప్‌చేసింది. ముఖ్యంగా పేదప్రజలకు అనుగుణంగా ప్రకటించిన నిర్ణయాలకు, గృహ నిర్మాణ రాయితీలతో రియల్టీ లాభపడుతోంది. అలాగే స్మాల్ కాప్ షేర్లు కూడాపాజిటివ్ గా ఉన్నాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు మాత్రం నష్టాలతో ఉన్నాయి. ఐషర్, అంబుజా, అల్ట్రాటెక్, ఏసీసీ, బీపీసీఎల్ పుంజుకోగా, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హీరో మోటో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జపాన్, చైనా, హాంగ్ కాంగ్, సింగపూర్, అమెరికా, బ్రిటన్, ఇతరులలో, న్యూ ఇయర్ డే సందర్భంగా సెలవు. అమెరికాసహా పలు ప్రపంచ మార్కెట్లకు నేడు సెలవుకావడంతో ఆరంభంలో సానుకూలంగా ఉన్నా వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు శుక్రవారం నగదు విభాగంలో ఎఫ్‌ఐఐలు దాదాపు రూ. 586 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 5 పాయింట్ల నష్టంతో రూ.67.97 వద్ద ఉంది.
ఏడాది ఆరభంలో ప్రతికూలంగా మార్కెట్లు
Published Mon, Jan 2 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement
Advertisement