
పుణె: మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. పుణె-సోలాపూర్ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక రెస్టారెంట్‌లో అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరుగా స్నేహితులతో కూర్చున్న దాన్వే వద్దకు వెళ్లి తలపై పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి కాల్చారు.
తలపై కాల్చగానే దాన్వే కిందపడిపోయాడు. అతని స్నేహితులు రెస్టారెంట్ నుంచి పారిపోయారు. ఇంతటితో ఆగకుండా మరో నలుగురైదుగురు దుండగులు రెస్టారెంట్ లోపలికి వచ్చి కాల్పులకు గురై పడిపోయిన దాన్వేను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ హత్య హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment