Ajith's 'Vidaa Muyarchi' First Schedule shooting starts in Pune - Sakshi
Sakshi News home page

Ajith Kumar: పుణెలో అజిత్ మూవీ.. భారీ షూటింగ్‌ సెట్ సిద్ధం!

Published Mon, Jun 12 2023 8:29 AM | Last Updated on Mon, Jun 12 2023 11:44 AM

Ajith Kumar Next Movie Shooting Schedule Starts In Pune - Sakshi

అజిత్‌ చిత్రం ఇంతకుముందు నటించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత ఆయన చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచే విషయమే. అజిత్‌ తాజా చిత్రానికి విడా ముయర్చి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆది నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది.

(ఇది చదవండి: మరోసారి సూపర్ హిట్‌ కాంబినేషన్‌.. సూర్య రిపీట్ చేస్తాడా?)

ముందుగా నయనతార భర్త విఘ్నేష్‌శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే నచ్చలేదన్న కారణంతో చిత్రం నుంచి తొలగించారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత అజిత్‌ భూటాన్‌, నేపాల్‌ దేశాల్లో బైక్‌ పర్యన చేసొచ్చారు. కాగా విడా ముయర్చి చిత్రానికి మగిళ్‌ తిరుమేణిని ఫిక్స్‌ చేశారు. దీంతో అజిత్‌ దర్శకుడు మగిళ్‌ తిరుమేణి కలిసి కథా చర్చలకోసం ఇటీవల లండన్‌లో మకాం పెట్టారు.

కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెలాఖరులో పూణేలో విడా ముయర్చి చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకోసం అక్కడ భారీ సెట్‌ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఇందులో అజిత్‌ సరసన త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నటుడు అర్జున్‌దాస్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు, అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

(ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement