ఈస్ట్‌కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు | Bomb threat call to eastcoast train in eluru | Sakshi
Sakshi News home page

ఈస్ట్‌కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు

Published Thu, Aug 25 2016 7:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ఈస్ట్‌కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు

ఈస్ట్‌కోస్ట్ రైలుకు బాంబు బెదిరింపు

ఏలూరు: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు సమాచారం గురువారం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టి.. బాంబు లేదని నిర్ధారించడంతో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  . 
 
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏలూరుకు చేరుకోగానే ఓ అగంతకుడు రైల్వే పోలీసులకు రైలులో బాంబు ఉందని సమాచారం అందించాడు. దీంతో భద్రతా సిబ్బంది రైల్లోని బోగీలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా గుర్తించారు. అనంతరం రైలు యధావిధిగా బయలుదేరింది. అయితే ఫోన్ చేసిన ఆకతాయి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement