హైకోర్టుకు బాంబు బెదిరింపు | High court gets bomb threat call | Sakshi

హైకోర్టుకు బాంబు బెదిరింపు

Mar 12 2014 12:38 PM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టుకు బాంబు బెదిరింపు - Sakshi

హైకోర్టుకు బాంబు బెదిరింపు

హైకోర్టులో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ బుధవారం కలకలం సృష్టించింది.

హైదరాబాద్ : హైకోర్టులో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ బుధవారం కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామని, అది ఏ నిమిషమైనా పేలుతుందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టులో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

 

తనిఖీల అనంతరం ఎలాంటి బాంబు లేదని పోలీసులు, బాంబు స్వ్కాడ్ తేల్చింది. ఇదంతా ఆకతాయి చర్యగా పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కోర్టులో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్తలతో ఉద్యోగులు హడలిపోయారు. చివరకి అసలు విషయం తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Video

View all
Advertisement