
సాక్షి, చెన్నై: తరచూ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని చెన్నై కీల్పాకం మానసిక రోగుల ఆస్పత్రికి తరలించేందుకు విల్లుపురం జిల్లా పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. సినీ నటుడు అజిత్ ఇంట్లో బాంబులు పెట్టినట్టు వచ్చిన ఫోన్‌కాల్‌తో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇది బూచీగా తేలింది. దీంతో బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు.
విల్లుపురానికి చెందిన భువనేశ్వర్‌గా గుర్తించారు. ఇతడు మానసిక రోగి అని, తన చేతికి ఫోన్ చిక్కితే చాలు కంట్రోల్ రూమ్‌లకు ఫోన్‌చేసి బాంబు బెదిరింపులు ఇవ్వడం పరిపాటిగా పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. ఇది వరకు మాజీ సీఎం పళనిస్వామి, నటులు రజనీ కాంత్, సూర్య, విజయ్ ఇళ్లల్లో బాంబులు ఉన్నట్టుగా ఈ యువకుడు బెదిరింపులు ఇచ్చాడు.
పోలీసులు పలుమార్లు హెచ్చరించి వదలిపెట్టారు. అయితే ఈసారి మానసిక రోగుల ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. చెన్నైలోని కీల్పాకం మానసిక రోగుల ఆస్పత్రికి భువనేశ్వరన్‌ను తరలించి చికిత్స అందించాలని విల్లుపురం జిల్లా కలెక్టర్‌కు ఎస్పీ రాధాకృష్ణన్ సిఫార్సు చేశారు.
చదవండి: అజిత్ ఇంట్లో బాంబు కాల్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment