బాంబు పేల్లుళ్ల హెచ్చరికతో గురువారం దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఢిల్లీ: బాంబు పేల్లుళ్ల హెచ్చరికతో గురువారం దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ హైకోర‍్టులో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావటంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు.
జడ్జిలతోసహా కోర్టులో ఉన్నవారందరినీ బయటికి పంపించేసి ఢిల్లీ పోలీసులతోపాటు, స్వాట్ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.