
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి కోల్‌కత్తా వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు ముప్పు ఉందంటూ విమానయాన సంస్థ కాల్ సెంటర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానయాన సంస్థ అప్రమత్తమైంది. ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానాన్ని వెంటనే వెనక్కి రప్పించి, దించేశారు. ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు.
ఢిల్లీ నుంచి కోల్‌కత్తా వెళ్లే ఏ1-020 విమానానికి ఈ బాంబు ముప్పు ఉందంటూ కాల్ వచ్చిందని తెలిసింది. ముంబైలోని ఎయిరిండియా సదర్‌ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్‌కు ఈ కాల్ ఇచ్చింది. వెంటనే ఆ విమానాన్ని ఐజీఐకి తరలించారు. ఆ విమానంలో 248 ప్రయాణికులు, 11 క్రూ సిబ్బంది ఉన్నాట్టు తెలిసింది. విమానంలో ప్రయాణికులను తన హ్యాండ్ లగేజీతోనే డీబోర్డు చేశారు. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై ఫిర్యాదును ముంబై పోలీసులకు కూడా ఫార్వర్డ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment