మందమర్రిలో దారుణం.. మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు | Two Mans were attacked On lifting a goat | Sakshi
Sakshi News home page

మందమర్రిలో దారుణం.. మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు

Published Sun, Sep 3 2023 12:56 PM | Last Updated on Sun, Sep 3 2023 1:21 PM

Two Mans were attacked On lifting a goat - Sakshi

మందమర్రి పట్టణం: మంచిర్యాల జిల్లా మందమర్రి లో దారుణం చోటు‌ చేసుకుంది. మేకను దొంగతనం చేశారనే నెపంతో ఎస్సీ యువకుడితో పాటు పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలను పెంచుతున్నారు.

మేకల మండి లో నుండి రెండు మేకలను మాయం చేశారని నెపంతో మేకల కాపరితో పాటు  అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో పశువుల కాపరి తేజ, ఎస్సీ యువకుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్‌పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగ పెట్టి వారిద్దరిని షెడ్డులో తలక్రిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు.

శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తన తమ్ముణ్ణి కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement