ఆదిలాబాద్(మందమర్రి): స్వచ్ఛ భారత్‌లో మేము సైతం అంటూ... సింగరేణి అధికారులు ముందుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో గురువారం ఉదయం సింగరేణి ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పులువురు అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందమర్రిలోని కార్మిక నగర్‌లో పేరుకు పోయిన చెత్తను అధికారులు శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగల్గుతామని వెంకటేశ్వరరెడ్డి అన్నారు.