
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని రామన్‌కాలనీలో గురువారం అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టారు. విషయం తెలియడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన టైగర్ హంటింగ్ అండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అటవీ అధికారులకు పట్టి చ్చేందుకు ఆపరేషన్ చేపట్టారు.
వారితో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు బేరం కుదిరింది. వారి సహకారంతో మందమర్రిలో అధికారులు మాటు వేశా రు. పెద్దపల్లి జిల్లా రామారావుపేటకు చెందిన మేకల నర్సయ్య పట్టణంలో ఎవ రూ లేని ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పులి చర్మంతోపాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు.