వికటించిన ఎంఆర్‌ వ్యాక్సిన్‌ | students hospitalized due to MR vaccine reaction | Sakshi
Sakshi News home page

వికటించిన ఎంఆర్‌ వ్యాక్సిన్‌

Published Thu, Aug 17 2017 3:32 PM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM

students hospitalized due to MR vaccine reaction

- ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
 
మందమర్రి: ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో ఎంఆర్‌ వ్యాక్సిన్‌ వికటించింది. స్థానికంగా ఉన్న లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. రూబెల్లా వాక్సిన్‌ను విద్యార్థులకు ఇవ్వగానే వారికి తీవ్రమైన వాంతులు అయ్యాయి. కొందరు కళ్లు తిరిగి పడిపోయారు.
 
దీంతో విద్యార్థులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వాక్సిన్‌ను సరైన విధంగా ఇప్పించటంలో యాజమాన్యం విఫలం అయిందని విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement