మందమర్రి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని శ్రీపతినగర్‌కు చెందిన వల్లాల రాములు(65) వైద్యం వికటించి శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందాడు. వైద్యం వికటించే రాములు మృతిచెందాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆర్‌ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.