మంచిర్యాల జిల్లా మందమర్రిలో చిన్నారులపై యాసిడ్ దాడి జరిగింది. సిరికొండ అనూష, సంగీత్ అనే బాలురపై శనివారం మధ్యాహ్నం సొంత పెద్ద నాన్న సిరికొండ సదానందం యాసిడ్ పోశాడని స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు బాధితులిద్దరినీ వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.