అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని..
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని.. వారి వైఖరిపై విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కాంగ్రెస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఊరేగింపునకు అనుమతించారని, గతంలో కాంగ్రెస్‌కు మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారని, ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని కమిషన్ చైర్మన్‌కు లీగల్‌సెల్ కో చైర్మన్ రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు.