తనకు ఎస్ఐ లెనిన్ బాబు నుంచి రక్షణ కల్పించాలంటూ ఓ మహిళ హెచ్ఆర్సీని ఆశ్రయించింది.
హైదరాబాద్: తనకు ఎస్ఐ లెనిన్ బాబు నుంచి రక్షణ కల్పించాలంటూ ఓ మహిళ హెచ్ఆర్సీని ఆశ్రయించింది. దుబ్బాక ఎస్ఐ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తనను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని హెచ్ ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా లెనిన్ బాబు నుంచి ప్రాణ హాని కూడా ఉండటంతో రక్షణ కల్పించాలని కోరింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ విచారణ జరిపించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.