శ్రీశైలంలో ఎస్ఐ చంద్రబాబు నాయుడు జులుం | complaint filed in HRC against SI chandrababu naidu | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో ఎస్ఐ చంద్రబాబు నాయుడు జులుం

Published Thu, Aug 21 2014 2:12 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో ఎస్ఐ చంద్రబాబు నాయుడు జులుం - Sakshi

శ్రీశైలంలో ఎస్ఐ చంద్రబాబు నాయుడు జులుం

శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైలం శ్రీ మల్లిఖార్జునస్వామి సన్నిధిలో ఖాకీలు జులుం చూపించారు. ఓ రెస్టారెంట్‌ ముందు యాత్రికులు వాహనాలు పార్కింగ్‌ చేశారనే కారణంతో రెస్టారెంట్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌, సెక్యూరిటీ గార్డుపై వన్‌టౌన్‌ ఎస్ఐ చంద్రబాబు నాయుడు, కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బాధితులు ఎస్ఐ చంద్రబాబు నాయుడుతో పాటు, కానిస్టేబుళ్లపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

వాహనాలను ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి తీసివేయిస్తామని చెప్పినా పట్టించుకోకుండా అసభ్య పదజాలంతో దూషించారని, రోడ్డుపైకి తీసుకెళ్లి తమపై దాడి చేశారని కమిషన్‌ దృష్టికి తెచ్చారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలోని ఫుటేజ్‌ను అందజేశారు. తమపై దాడికి దిగిన ఎస్‌, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement