హైదరాబాద్: లంబాడ హక్కుల పోరాట సమితి మానవ హక్కుల కమిషన్‌ను మంగళవారం ఆశ్రయించింది. కులం పేరుతో సహ ఉద్యోగులను దూషిస్తూ అవమానపరుస్తున్నారని గతంలో ఆంధ్రప్రదేశ్ హౌస్‌ఫెడ్ ఛైర్మన్ గోపాల్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టినట్టు హెచ్‌ఆర్‌సీకి తెలిపింది. అయితే పోలీసులు ఈ కేసు విషయంలో చర్యలు తీసుకోవడం లేదంటూ లంబాడ హక్కుల పోరాట సమితి హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసింది.