జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్‌లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు.
అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది.
కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశంకానున్నారు.
At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza.
Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D
— Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023
I am in Israel, a nation in grief.
I grieve with you and stand with you against the evil that is terrorism.
Today, and always.
סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT
— Rishi Sunak (@RishiSunak) October 19, 2023