ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా పోలీసులు తనకు భద్రత కల్పించడం లేదని, కేంద్ర ఇంటెలిజెన్స్ నుండి భద్రతరిత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా ఇంతవరకూ ఏపీ ప్రభుత్వం ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదని ఆంధ్రరప్రదేశ్ బీసీ సంఘం అద్యక్షుడు డేరెంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు.
- ఏపీ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు డేరంగుల
హైదరాబాద్‌సిటీ: ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా పోలీసులు తనకు భద్రత కల్పించడం లేదని, కేంద్ర ఇంటెలిజెన్స్ నుండి భద్రతరిత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా ఇంతవరకూ ఏపీ ప్రభుత్వం ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదని ఆంధ్రరప్రదేశ్ బీసీ సంఘం అద్యక్షుడు డేరెంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. ఆదివారం ఎర్రగడ్డలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సామాజికవర్గ ప్రజలకోసం పోరాడుతున్న తనకు అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తన కుటుంబానికి హాని తలపెట్టడానికి యత్నిస్తున్నారని ఓ లేఖలో మానవహక్కుల సంఘానికి, ఏపీ డీజీపీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విచారణ చేపట్టాలంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆదేశాలు వావడంతో జీర్ణించుకోలేని కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
విచారణకు న్యాయబద్దంగా, చిత్తశుద్దిగా చేయాలని డిమాండ్ చేశారు. భాద్యతాయుతంగా, సామాజికవర్గ ప్రజల కోసం పోరాడితే కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మరి రాష్ట్రంలో రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నుండి భద్రతను ఇవ్వాలని వివరించినా ఇంతవరకూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తనకు, నా కుటుంబానికి ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. భద్రతను ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు.