'చక్రి మరణంపై అనుమానాలున్నాయి' | Sravani Chakri complaints against seven family members | Sakshi
Sakshi News home page

'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'

Published Sat, Jan 10 2015 11:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'

'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'

హైదరాబాద్ : చక్రి మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆయన భార్య శ్రావణి అన్నారు. 'చక్రి చనిపోయే ముందురోజు మా అత్తగారింట్లో భోజనం చేశారు. చక్రి చనిపోగానే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు తీసేసుకున్నారు' అని ఆమె తెలిపారు. తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు. కుటుంబ వ్యవహారం కావటంతో తాము దాసరి నారాయణరావు గారిని కలవటం జరిగిందని, ఆయన ఏం చెబితే అలా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నా... చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సహకరించలేదన్నారు. ఆ తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించటం జరిగిందన్నారు.  

తనకు న్యాయం జరగాలని శ్రావణి అన్నారు. చక్రి కుటుంబ సభ్యుల్ని కోడలుగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. అయినా వారు తనకు సహకరించటం లేదన్నారు.  మనిషి బతికి ఉన్నప్పుడు ఒకలాగా...చనిపోయిన తర్వాత మరోలా ఎలా ఉంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చక్రి కుటుంబసభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement