నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 22లో కూల్చివేసిన వీధి బాలల స్కూల్ విద్యార్థులకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్‌కు పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి. సుధాకర్, సామాజిక మహిళా కార్యకర్త శోభారాణిలు ఈ ఫిర్యాదు చేశారు. ఈమేరకు నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పెదపేరిరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వీధి బాలల స్కూల్ జూబ్లీహిల్స్‌లో ఉండటానికి వీలు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశాన్ని చూపించాలని, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా స్కూలును ఈ నెల 27న అర్థరాత్రి కూల్చివేయడం దారుణమని వివరించారు.