గెయిల్ పేలుడు దుర్ఘటనపై మానవహక్కుల సంఘం(హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది.
* గెయిల్ ఘటనపై హక్కుల సంఘం
సాక్షి,హైదరాబాద్: గెయిల్ పేలుడు దుర్ఘటనపై మానవహక్కుల సంఘం(హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. పేలుడుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వై. సోమరాజు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సంఘం అక్కడి గ్రామాల్లో ప్రజలకు జీవించే హక్కును కాపాడాలని స్పష్టం చేసింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. తమ ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ జూలై 10 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.