pipeline burst
-
నిధులు అవి‘నీటి’ పాలు
తెల్లవారుజాము.. సమయం సుమారు 4 గంటలు.. వినాయక ఉత్సవాలు సంబరంగా జరుపుకొని అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు.. ప్రశాంతంగా.. నిశ్శబ్ధంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దాలు.. జనం తుళ్లిపడి లేచారు. లేచి చూస్తే.. రోడ్లపైనా, అపార్ట్మెంట్లలోకి, షాపుల్లోకి నీరు వెల్లువెలా ముంచెత్తింది. ఈ పరిణామాలన్నీ చూసి.. భూకంపం సంభవించిందా?.. వర్షం ముంచెత్తిందా??.. వరద వెల్లువెత్తిందా???.. అన్న భావనలతో భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరయ్యా రు.. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్న.. ఆకస్మాత్తుగా ముంచెత్తిన వర ద కాని వరదతో ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. రాకపోకలు స్తంభించి వాహనాదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఆ శబ్దాలు.. భూ ప్రకంపనలు కావు.. అలాగని వర్షాలు, వరదలూ ముంచెత్తలేదు.. అది తాటిపూడి పైపులైన్ పేలుడు.. లీకేజీలు సృష్టించిన తాత్కాలిక ఉపద్రవం. నాసిరకం నిర్మాణం కారణంగా ఈ పైపులైన్‌కు పగుళ్లు, లీకులు కొత్తేం కాదు. అంచనా వ్యయానికి మించి రూ.81కోట్లకుపైగా ఖర్చు చేసినా.. ఏటా మరమ్మతులకే సగటున రూ.18 లక్షలు ఖర్చు చేస్తున్నా.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి దెబ్బ కు అవన్నీ లీకేజీ నీళ్లలో కలిసిపోతున్నాయి. ఫలితంగా తరచూ లీకులు, పగుళ్లతో విలువైన నీళ్లు, నిధులు వృథా కావడం.. మరమ్మతులు, నీటిసరఫరా నిలిపివేత కారణం గా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు నిత్యకృత్యమయ్యాయి. లీకులే లీకులు.. 2012.. 9 2013.. 12 2014.. 5 2015.. 13 2016.. 9 2017.. 9 2018.. 5 2019(ఇప్పటివరకు).. 5 సాక్షి, విశాఖపట్నం: తాటిపూడి పైపులైన్ మరో సారి పగిలింది. అడుగుకో అక్రమం, పైపు పైపులో అవినీతి ప్రవాహం సాగడంతో నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సిన పైప్‌లైన్‌కు నిలువెల్లా పగుళ్లు, లీకేజీలే మిగిలాయి. మంగళవారం తెల్లవారుజామున కంచరపాలెం బీఆర్టీఎస్ రహదారిపై తాటిపూడి పైప్‌లైన్ పగిలి పోయి వేల లీటర్ల నీరు వృథా అయ్యింది. ఈ పైపులైన్ పగలడం ఇది 67వ సారి. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఈ పైపులైన్ దుస్థితికి నిర్మాణంలో అవినీతే కారణమని అధికారులు నివేదికలు ఇచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పనులు పూర్తిచేయకున్నా.. అదనంగా నిధులు.. విస్తరిస్తున్న విశాఖ నగర భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 10ఎంజీడీల నీటి సరఫరా చేసేలా తాటిపూడి పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. 2011లో జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో విజయనగరం జిల్లా నుంచి తాటిపూడి నుంచి విశాఖ నగరంలోని టీఎస్సార్ కాంప్లెక్స్ వరకూ సుమారు 63 కిలోమీటర్ల మేర పైప్లైన్లు నిర్మించేందుకు రూ.81.28 కోట్లతో ఐహెచ్పీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు పనులు అప్పగించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం రూ.62.28 కోట్లకే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ మాత్రం కాంట్రాక్టర్‌కు మరో రూ.19 కోట్లు పెంచి రూ.81.28 కోట్లు సమర్పించింది. సదరు కాంట్రాక్టర్ మాత్రం నిధులు సరిపోవడం లేదంటూ టీఎస్సార్ కాంప్లెక్స్ వరకు కాకుండా 4 కిలోమీటర్ల ముందు కంచరపాలెం సమీపంలోని గోదావరి పైపులైన్‌కు అనుసంధానం చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. టెండర్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయకున్నా బిల్లులు మాత్రం చెల్లించేశారు. అలా ఎందుకు చెల్లించారన్న దానికి జీవీఎంసీ అధికారుల వద్ద ఇప్పటికీ సమాధానం లేదు. పైసలు పోయె.. పగుళ్లు మిగిలె.. కాగా వేసిన 59 కిలోమీటర్ల పైపులైన్లోనూ నాణ్యత ఏమాత్రం లేకపోయినా అప్పటి అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. భారీ పైపులైన్లు వేసినప్పుడు ఇరువైపులా 10 మీటర్ల వరకు వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్త వహించాలి. కానీ తాటిపూడి పైపులైన్‌పై ఏకంగా ఫోర్‌లైన్ బీఆర్టీఎస్ రహదారి వెళ్తోంది. దాంతో ఒత్తిడి పెరిగి పైపులు తరచూ పగిలిపోతున్నాయి. అయినా కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జీవీఎంసీ అధికార యంత్రాంగం మౌనం వహిస్తోంది. పైప్‌లైన్‌పై పలు చోట్ల భవంతులు సైతం వెలిశాయి. పెందుర్తి మార్గంలో ఎల్జీ పాలిమర్స్ దాటిన తర్వాత ఆక్రమణలు మొదలయ్యాయి. ఎస్ఆర్ ఆస్పత్రి ముందు నుంచి పైప్ లైన్ మీదుగా పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. గోపాలపట్నం జంక్షన్లో తాటిపూడి ఎయిర్పంప్పై ఏకంగా ఓ బేకరీనే నిర్మించేశారు. ఇలా ప్రతి చోటా పైపులైన్‌పై ఒత్తిడి పెరుగుతుండటం వల్ల అవి పగిలిపోతున్నాయి. గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకూ పైప్‌లైన్‌పై సుమారు 100కి పైగా కట్టడాలు ఉన్నట్లు జీవీఎంసీ అధికారులు గుర్తించి నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యం. నిర్వహణ అస్తవ్యస్తం.. చిన్నచితకా పనుల విషయంలో నిబంధనల పేరుతో హడావుడి చేసే జీవీఎంసీ ఇంజినీర్లు.. తాటిపూడి కాంట్రాక్టర్‌కు మాత్రం నిర్వహణ విషయంలో మినహాయింపునిచ్చేశారు. 2011 లో ప్రాజెక్టు ప్రారంభమై అదే ఏడాది పూర్తయింది. ఆ తర్వాత ఏడేళ్ల వరకూ అంటే 2018 వరకు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి. కానీ అసంపూర్తి పనులు చేసి పూర్తి బిల్లులు తీసుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత నిర్వహణ విషయాన్ని గాలికొదిలేసింది. 2012 నుంచే పైపులైన్ లీకేజీలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కార్పొరేషనే మరమ్మతు పనులకు నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఏడేళ్లలో సుమారు రూ. 1.10 కోట్లు మరమ్మతులకు ఖర్చు చేసింది. ఆడిట్లో అక్రమాలు బట్టబయలు జేఎన్ఎన్యూఆర్ఎం పనులఆడిట్లో తాటిపూడి పైప్‌లైన్ వ్యవహారం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో పాటు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అవకతవకలు జరిగాయని తేటతెల్లమైంది. కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి ఇంజినీర్ల బృందం.. అవకతవకలు జరుగుతున్నా ప్రోత్సహించడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. పైగా తాటిపూడి పైపులైన్ నిర్వహణకు ప్రత్యేకంగా టెండర్లు పిలిపించారు. ఏటా రూ.18లక్షలతో పనులు అప్పగించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ వల్ల కార్పొరేషన్ ఖజానాకు రూ.కోట్లు చిల్లు పడగా.. ఇప్పుడు ఏటా రూ.18లక్షలు చేతి చమురు వదులుకోవాల్సిన పరిస్థితి. ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నిస్తాం.. తాటిపూడి పైప్‌లైన్ మరమ్మతులు పూర్తయ్యాయి. పారిశ్రామిక అవసరాలకు హెచ్‌పీసీఎల్ నీటిని వినియోగించకపోవడం, తాటిపూడి రిజ ర్వాయర్ వద్ద ప్రెజర్ పెరగడం వల్ల పగులు ఏర్పడిందని అధికారులు ప్రాథమికంగా నిర్థరించారు. పైప్‌లైన్ వెంబడి ఆక్రమణలున్నాయని తెలిసింది. వాటిని తొలగించి.. పైప్‌లైన్‌పై ప్రెజర్ పడకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు, పగుళ్లు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపడతాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం.. తాటిపూడి పైప్‌లైన్ పగలడం వల్ల కేవలం హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, కోరమండల్ పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది తలెత్తింది. ఎన్ఏడీ కొత్త రోడ్డు, పెందుర్తి, తాటిపూడి, వేపగుంట, గోపాలపట్నం, కంచరపాలెం మెట్టు వరకు కొన్ని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చెయ్యలేకపోయాం. 9 గంటల్లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. బుధవారం నుంచి సరఫరా యథాతథంగా ఉంటుంది. పైప్ లైన్ మరమ్మతులకు సంవత్సరానికి రూ.18 లక్షలు వెచ్చిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్, ఎస్ఈ, జీవీఎంసీ నీటిసరఫరా విభాగం బీఆర్టీఎస్ రహదారిలో ప్రకంపనలు.. కంచరపాలెం(విశాఖ ఉత్తరం): కంచరపాలెం బీఆర్టీఎస్ ప్రధాన రహదారిలో తాటిపూడి భూగర్భ ప్రధాన పైప్‌లైను మంగళవారం వేకువజామున 4గంటల సమయంలో పెద్ద శబ్దంతో నాలుగు చోట్ల పగిలింది. ఈ ఘటనలో రహదారి పాక్షికంగా దెబ్బ తింది. రాకపోకలు స్తంభించాయి. పైప్‌లైన్ నుంచి గంటల పాటు నీరు పొంగి ప్రవహించడంతో స్థానిక దుకాణాల్లోకి, ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఓ అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా నీట మునిగింది. అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న వాచ్మెన్ శ్రీనివాసరావు వస్తుసామగ్రి పూర్తిగా మునిగిపోయాయి. సమీక్షించిన అధికారులు, నాయకులు.. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్యే పి.గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వాచ్‌మన్ శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు మళ్ల విజయప్రసాద్ తెలిపారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు పరిస్థితి సమీక్షించారు. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని జీవీఎంసీ అధికారులు తెలిపారు. మళ్లీ ఇక్కడే.. : మళ్ల మూడేళ్ల క్రితం తాటిపూడి పైపులైన్ మరమ్మతులకు గురై కంచరపాలెం నుంచి ఐటీఐ కూడలి, ఊర్వశి జంక్షన్ వరకు రహదారి పాక్షికంగా దెబ్బ తిన్న సంఘటన మరవకముందే మళ్లీ అదేచోట ఇలాంటి సంఘటన జరగడం బాధకరమని మళ్ల విజయప్రసాద్ అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పైప్‌లైన్ నిర్వహణలో, నాణ్యత విషయంలో రాజీపడకుండా.. సమస్య పునరావృతం కాకుండ గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో జోన్–4 జోనల్ కమిషనర్ సింహాచలం, ఈఈ రాజారావు, విద్యుత్ డీఈ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షులు కెపి.రత్నాకర్, ముర్రువాణీ నానాజీ, ఆడారి శ్రీను, నాగేశ్వరరావు, నాయకులు కొణతాల ఉమమహేశ్వరరావు, పల్లా ఎర్నికుమార్, చెంగల ఈశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఊరంతా వరదేనండి..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద శుక్రవారం ఉదయం మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో సింగూరు జలాలు గ్రామాన్ని ముంచెత్తాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. సమీపంలోని పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు రావడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి. కోళ్లు, రెండు గొర్రెలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని పొలాల్లోకి నీరు చేరడంతో రైతులకు నష్టం వాటిల్లింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. అందుకు పైప్‌లైన్ పనులు చేస్తున్న కంపెనీ అంగీకరించడంతో ఆందోళన విరమించారు. – నిజాంసాగర్ -
బ్లో అవుట్ దెబ్బకు 180 మెగావాట్ల విద్యుత్ ఫట్!
హైదరాబాద్:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు. -
జీసీఎస్ గ్రీన్‌బెల్టులో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు(తూర్పుగోదావరి జిల్లా): గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నుంచి తేరుకోకముందే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) గ్రీన్‌బెల్ట్ ఏరియాలో స్వల్పంగా గ్యాస్ లీక్ అవడం స్థానికులను ఆదివారం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి ఈ లీకేజీ జరిగింది. పొగ మాదిరిగా సహజవాయువుతోపాటు కొద్దిపాటి ముడిచమురు లీకవుతున్నట్టు స్థానికులు ఆదివారం సాయంత్రం గుర్తించారు. పదిరోజులుగా ఇది కొనసాగుతున్నట్టు సమాచారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ 216 జాతీయ రహదారిపై ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, అయినప్పటికీ లీకేజీని ఆపేశామని ఓఎన్జీసీ అధికారులు చెప్పారు. -
కునుకు లేకుండా చేస్తున్న మరో పైపులైన్
మామిడికుదురు: ‘నగరం’ మహా విస్ఫోటం కళ్లముందు కదలాడుతుండడంతో.. గెయిల్ సంస్థ తమ ఊళ్ల నుంచి వేసిన గ్యాస్ పైపులైన్లు నగరం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తరచూ అవి లీకవుతూ ఉండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని తాటిపాక-కాకినాడ ట్రంక్ పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవడం స్థానికులను భయానికి గురి చేస్తోంది. ఈ లైన్ వెళ్తున్న పాశర్లపూడిలో పైపులైన్లకు వారం రోజుల వ్యవధిలో కేవలం 500 మీటర్ల పరిధిలోనే ఆరుచోట్ల మరమ్మతులు చేశారు. భూమికి అయిదున్నర అడుగుల లోతులో ఏర్పాటు చేసిన 18 అంగుళాల పైపులైన్ల ద్వారా నిత్యం ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా చేస్తున్నారు. నగరం నుంచి కాకినాడ వరకూ ఒకటి, తాటిపాక నుంచి సామర్లకోట వరకూ మరొకటి ఈ పైపులైన్లు ఉన్నాయి. ఈ లైన్లలో ఎక్కడ లీకేజీలున్నా దానిని గుర్తించే యూనిట్ తాటిపాక టెర్మినల్‌లో ఉంది. ఆ పైపులు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారీ విధ్వంసానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విజయవాడ ల్యాంకో ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఈ పైపులైన్ కంట్రోల్ యూనిట్ వాల్వ్ 10 కిలో మీటర్ల దూరంలోని దిండి గ్రామంలో ఉంది. ప్రమాద సమయానికి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగి అందుబాటులో లేకపోవడమే విస్ఫోటానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్‌పై ఆందోళన రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి లీకేజీ జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, దీనివల్ల ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. -
20కి చేరిన మృతులు
కాకినాడ: నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కె.చిన్నా శనివారం అర్ధరాత్రి, తాటికాయల రాజ్యలక్ష్మి (25) చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. రాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ, చిన్న కుమార్తె సజీవ దహనం కాగా పెద్ద కుమార్తె లక్ష్మీ జ్యోత్స్నదేవి (4) శుక్రవారం అర్ధరాత్రి మరణించింది. ఆ కుటుంబంలో మిగిలి ఉన్న రాజ్యలక్ష్మి కూడా మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా మరో ఏడుగురు చికిత్స పొందుతూ మరణించారు. చిరు, బొత్సలకు నిరసనల సెగ అమలాపురం: గెయిల్ పైపులైన్ పేలుడు బాధితులను పరామర్శించేందుకు నగరం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘మాయదారి పరామర్శలు మాకొద్దు.. న్యాయం చేసేవారే రండి. లీడర్స్ గో బ్యాక్, యూపీఏ వల్లే మాకీ దుర్గతి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సర్వం ధ్వంసం
పూరిపాకలే దెబ్బతిన్నాయన్న చంద్రబాబు ప్రకటనపై బాధితుల ఆగ్రహం పక్కా ఇళ్లకు పరిహారంపై ప్రకటన చేయని ప్రభుత్వం అమలాపురం: ఏదైనా భారీ ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని నష్టంపై ఒక నిర్ణయానికి వస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, ఇతర విభాగాల సిబ్బంది ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. నష్టాన్ని అంచనా వేస్తారు. అయితే, తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైపు లైను పేలిన ఘటనలో ఇళ్లకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు. పంటలు, కొబ్బరి తోటలు, జంతువులు, పక్షులకు తీవ్ర నష్టం జరిగింది. నివాస గృహాలకూ భారీ నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన రోజున సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూరిపాకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. దీంతో దెబ్బతిన్న పక్కా భవనాలకు పరిహారం ఇవ్వరేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నా రు. ఈ ప్రమాదంలో పూరిపాకలే కాదు.. పక్కా భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు తీవ్రతకు గోడలు బీటలు వారాయి. ఫ్లోరింగ్ ధ్వంసమైంది. గుమ్మాలు, తలుపులు మాడి మసైపోయాయి. ప్రమాదంలో మొత్తం 12 ఇళ్లు దగ్ధమవగా, వీటిలో ఆరు పక్కా భవనాలు, ఒక పెంకుటిల్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, నాలుగు పూరిళ్లు ఉన్నాయి. పెంకుటింట్లో నివాసముంటున్న సత్యనారాయణ, జ్యోత్స్నాదేవి, ఏడాది బాలిక, అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆర్.సూర్యనారాయణ, బాలాజీ, దివ్యతేజ, మరో బాలిక మృత్యువాత పడ్డారు. పక్కా భవనాల్లో నివసిస్తున్నవారిలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ భవనాలకు ఎంత నష్టం జరిగి ఉంటే ఇంతమంది మరణించి ఉంటారన్న విషయాన్ని సర్కారు పట్టించుకోలేదు. బీటలు వారిన ఇళ్లు ఎంతోకాలం ఉండవని, ఉన్నా అవి నివాసయోగ్యం కాదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం పక్కా భవనాలకు నష్ట పరిహారంపై ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పేలుడు జరిగిందని, బాధితులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా సరిపోదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్యాస్ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. -
తాటిపాకలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజీ
కాకినాడ: నగరం విషాదం మరవక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తాటిపాక ఓఎన్జీసీ రిఫైనరీలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజితో స్థానికులు బెంబేలెత్తారు. లీకేజీని ఆపేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, నగరం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి పొగవస్తున్న ప్రాంతాన్ని తాటిపాక ప్లాంట్ ఇంచార్జ్ విక్రాంత్ పరిశీలించారు. పైప్‌లైన్ తుప్పుబట్టి ఉండడంతోనే గ్యాస్ లీకవుతుందని ఆయన తెలిపారు. నిప్పు ఉంటే ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు. నగరం గ్యాస్ పైపు పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తాటికాయల రాజ్యలక్ష్మి(25) ఆదివారం మృతి చెందింది. -
గెయిల్ ఘటనపై ఆర్పి సింగ్ కమిటీ విచారణ
అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా గెయిల్ గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు కమిటీ సిద్ధమైంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు అయిన ఉన్నతస్థాయి కమిటీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించనుంది. దుర్ఘటన పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజాన్ని నిగ్గు తేల్చనుంది. శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్లేన్లో పేలుడు సంభవించి.... 16 మంది సజీవ దహనమయ్యారు. ఘటనపై స్పందించిన కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి కమిటీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న గెయిల్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. -
గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు విషాదం
-
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
-
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
అమలాపురం : సరిగ్గా ఒక్క రోజు క్రితం ఆ గ్రామం కళకళలాడింది. పచ్చని కొబ్బరి తోపులు... వాటి మధ్య వంపులు తిరుగుతూ పారే కాలువ... ఒకవైపు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో కీలకంగా ఉండే తాటిపాక మినీ రిఫైనరీ, ఓఎన్జీసీఎస్. మరోవైపు మార్కెట్ యార్డు గోడౌన్లు, అందమైన భవనాలు, హోటళ్లు, 216 జాతీయ రహదారి. చమురు సంస్థల్లోకి వెళ్లొచ్చే ఉద్యోగులు, ప్రయాణికులతో కిటకిటలాడే రహదారి. ఇలా ఎప్పుడూ సందడిగా ఉండే మామిడికుదురు మండలం నగరంలోని వానవాశివారి మెరక మరుభూమిగా మారిపోయింది. గెయిల్‌కు చెందిన పైపులైన్ దుర్ఘటనతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. మంటల్లో కాలిపోయిన శవాలు, ఒళ్లంతా తగులబడి సహాయం కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు..బుగ్గవుతున్న ఇళ్లు, మాడిమసైపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, తప్పించుకునేందుకు వీలు లేక అగ్నికీలల బారిన పడి చనిపోయిన పశువులు, పక్షులు. ఇలా హృదయ విదారక ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు ఉదయం వేళే నిద్ర లేచి తమ తమ దుకాణాలు తెరిచి పొట్టపోసుకునే సమయం... ఇంకొంత మంది ఇంకా నిద్రమత్తులోనే జోగుతున్న వేళ.. భవిష్యత్తు గురించి తియ్యటి కలలు కంటున్న తరుణం... ఆ ఆశలన్నీ సమాధైపోయాయి. వారి కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఓ శ్మశాన వాటికలా మారిపోయింది. 24 గంటల క్రితం పచ్చగా కళకళలాడిన నగరం గ్రామం ఒక్కరోజులోనే కన్నీటి సంద్రంలో కూరుకు పోయింది. గెయిల్ పైప్‌లైన్ పేలిన ఘటనలో 16 మంది మృత్యువాతపడిన నగరం గ్రామమంతా విషాదం నెలకొంది. -
మంటలా,పేలుడా...ఏది ముందు?
-
మృత్యు జ్వాల
-
పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్
-
మృత్యు విస్ఫోటం
-
శ్మశానంగా మారిన నగరం
-
ముద్దు బిడ్డలు మాంసపు ముద్దలయ్యారు
నగరం: అగ్నికీలలు చుట్టుముట్టాయి.. ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. తనను హత్తుకొని నిద్రిస్తున్న ఇద్దరు ముద్దు బిడ్డలను రక్షించుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించలేదు. బిడ్డలతోపాటు ఆమెను కూడా మృత్యువు కబళించింది. చుట్టపుచూపుగా వచ్చిన ఆమె మరిది, తోడికోడలు కూడా సజీవదహనమయ్యారు. గెయిల్ గ్యాస్ పైపు దుర్ఘటనలో గటిగంటి వాసు కుటుంబం విషాదమిది. 216 జాతీయ రహదారి సమీపంలో వాసు కుటుంబం హోటల్ నడుపుకొంటోంది. శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైపు పేలుడుతో సంభవించిన మంటలు వాసు ఇంటిని కూడా చుట్టుముట్టాయి. ఏమి జరుగుతోందో తెలిసేలోపే వాసు భార్య అనంతలక్ష్మిని, ఆమెను హత్తుకుని నిద్రిస్తున్న పిల్లలు సుజాత (6), సాయి గణేష్ (4) లతోపాటు ముందురోజే వచ్చిన వాసు తమ్ముడు మధు (35), మరదలు కోకిల (33)ను కబళించాయి. క్షణాల్లోనే ఐదుగురూ మసైపోయారు. బిడ్డలను రక్షించేందుకు అనంతలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైనట్లు మృతదేహాలు పడి ఉన్న తీరు చెబుతోంది. కాగా వాసు ఆచూకీ తెలియరాలేదు. -
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాలను ఇవ్వకపోగా వారి పాలిట ఇప్పుడు పెనుగండంగా మారింది ఆ గడ్డ గర్భంలోని సంపద. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. - నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు - తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో విరుచుకుపడ్డ చిచ్చు - 15 మంది సజీవ దహనం - మరో 27 మందికి గాయాలు - 15 మంది పరిస్థితి విషమం సాక్షి, కాకినాడ/ మామిడికుదురు : చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. మాంసపు ముద్దల్లా మిగిలారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవిం చింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమం త్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు , హోం మంత్రి చినరాజప్పను చుట్టుముట్టి చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు మూల్యం గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్‌ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్‌లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపిం చాయని స్థానికులు చెబుతున్నారు. లీకై న గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వా దన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటి లా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్‌పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు 3 గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమిలోం చి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నా యి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్య ల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు. -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, కేంద్ర, రాష్ర్ట మంత్రులు మామిడికుదురు/కాకినాడ క్రైం : నగరం పైపులైన్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వెద్యసహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో కలిసి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం మధురపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో నగరం చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓఎన్జీసీ డౌన్‌డౌన్ అంటూ సీఎం ఎదుట నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రావాల్సిందిగా బాధితులు పట్టుబట్టినప్పటికీ పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడులతో కలిసి కాకినాడ చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బీజేపీ ఏపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదితరులతో కలిసి కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. స్థానికుల నిరసన ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడిన ఇంటిని కానీ, మరో కుటుంబంలో ముగ్గురు చనిపోయిన ఇంటిని కానీ చంద్రబాబు పరిశీలించకుండానే వెనుదిరగడంపై స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఎంతో హడావిడి చేసి పోలీసు బందోబస్తు మధ్య ఎవరిని ఉద్దరించడం కోసం ఇక్కడకు వచ్చారంటూ బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట వచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రోడ్డుపైన కారు దిగి, రోడ్డుపైనే నిలుచుని మళ్లీ అక్కడ నుంచే వెనుదిరిగారే తప్ప సంఘటన స్థలంలో కనీసం కాలుమోపలేదు. -
మృత్యుకీలలు
కోనసీమవాసులకు సుఖసంతోషాల్నివ్వకపోగా కష్టనష్టాల పాలు చేస్తున్న ఆ గడ్డ గర్భంలోని సంపదే.. వారి పాలిట పెనుగండంగా మారింది. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. పద్మవ్యూహంలో అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవుల్లా.. చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు. కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మరి కొందరు పగవారిలా తరిమే కీలల బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసినా ఫలితం లేక విగతజీవులై నేలకొరిగారు. వేకువకు ముందే విరుచుకుపడ్డ విలయాగ్ని చివరికి పచ్చని పంటపొలాలనూ, తోటలనూ, మూగజీవాలనూ బుగ్గి చేసింది. - నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు - పచ్చనిసీమపై విరుచుకుపడ్డ చిచ్చు - నగరంలో విస్ఫోటించిన పైపులైన్ - 15 మంది సజీవ దహనం, 27 మందికి గాయాలు - వారిలో 15 మంది పరిస్థితి విషమం సాక్షి, కాకినాడ / మామిడికుదురు : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పలను చుట్టుముట్టి చమురు సంస్థల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోనసీమలో 1993లో కొమరాడ..1995లో దేవర్లంక.. 1996లో దేవరపల్లి, 2005లో తాండవపల్లిలో బ్లో అవుట్లు సంభవించాయి. వీటిలో దేవర్లంక బ్లో అవుట్ రెండు నెలల పాటు ప్రజ్వరిల్లింది. ఈ ఘటనల్లో పచ్చని పొలాలు మాడిమసైపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గయింది. ఇక పరిపాటిగా మారిన పైపులైన్ల లీకేజ్‌లతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా ఇప్పటి వరకూ ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం లేదు. శుక్రవారం నాటి ఘటన కోనసీమలో చమురు కార్యకలాపాల చరిత్రలోనే తొలిసారి 15 ప్రాణాలను బలిగొంది. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలే మూల్యం.. గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్‌ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది. నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్‌లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కాగా లీకైన గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటిలా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి. మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్‌పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు సుమారు మూడు గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమి లోంచి పొగలు, వేడిగాలులు వస్తూనే ఉన్నాయి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. కోనసీమ చవి చూసిన పెనువిషాదాల్లో ఒకటి అనదగ్గ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 15 మందిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీల్లేని రీతిలో మాంసపుముద్దల్లా మిగిలారు. మరో 27మంది వరకు గాయాల పాలవగా, వారిలో 15 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారిని తొలుత అమలాపురం ఏరియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ అపోలో, ట్రస్ట్, సేఫ్ ఆస్పత్రులకు తరలించారు. కాకినాడలో 11 మంది, రాజమండ్రిలో ఇద్దరు, అమలాపురం కిమ్స్‌లో ఏడుగురు, రాజోలులో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు హాహాకారాలతో ఆస్పత్రులు దద్దరిల్లిపోతున్నాయి. బాధ భరించలేక ‘మమ్మల్ని చంపేయండి’ అని వైద్యులకు మొర పెట్టుకుంటుంటే చూసేవారికి గుండెల్ని పిండినట్టయింది. శ్మశానాన్ని తలపించిన ఘటనాస్థలి పేలుడు జరిగిన ప్రాంతం ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలతో శ్మశానాన్ని తలపించింది. అగ్ని కీలల్లో దగ్ధమై, మాంసపుముద్దల్లా మిగిలిన మృతులు, మాడి మోడుల్లా మిగిలిన కొబ్బరిచెట్లు, మంటల్లో చిక్కుకొని బూడిదైన పక్షులు.. ఏ వైపు చూసినా కన్ను తట్టుకోలేని బీభత్సమే.. గుండె భరించలేని విధ్వంసమే. ఈ ఘటనలో క పది కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. 12 ఇళ్లు, మండల వ్యవసాయశాఖ కార్యాలయం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు మాడిమసైపోయాయి. ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటరు (జీసీఎస్), గెయిల్ కార్యాలయాలు సమీపంలో ఉండడంతో పైపులైన్ ప్రారంభంలో ఈ ఘటన జరిగి ఉంటే ఊహకందనంత పెను విధ్వంసమే జరిగేది. పేలుడు ప్రాంతానికి చేరువలోనే మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. దుర్ఘటన పగటిపూట జరిగి ఉంటే వందల్లో ప్రాణ నష్టం ఉండేదని స్థానికులు అంటున్నారు. ఉదయం 5.10 గంటలకు ఘటన జరిగితే గంటన్నర వరకూ పోలీసులు మినహా అధికారులెవరూ కన్నెత్తై చూడలేదు. ఆరున్నరకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడే మంటలను అదుపు చేసేందుకు సాహసం చేయలేకపోయారు. ఒకటి తర్వాత మరొకటిగా ప్రభుత్వ అగ్నిమాపక శకటాలతో పాటు గెయిల్, రిలయన్స్, రవ్వ, కెయిర్న్ ఎనర్జీ, జీఎస్పీసీలకు చెందిన పది శకటాలు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. కాగా పేలుడుపై కేసు నమోదు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం డౌన్..డౌన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా ప్రాణ, ఆస్తినష్టాలకు కారణమైన ఓఎన్జీసీ, జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్ర హోదగ్రులయ్యారు. వందల మంది జీసీఎస్ మెయిన్ గేట్‌ను చుట్టుముట్టి గ్యాస్ కలెక్షన్ సెంటర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆ సంస్థ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సీఎం డౌన్ డౌన్..ఓఎన్జీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం వారిని సముదాయించి దుర్ఘటనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ జరిపించి దుర్ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరామర్శించేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు బాధితులు తమ గోడు వినిపించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. నగరంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కోటగుమ్మం (రాజమండ్రి) : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపులైన్ పేలుడుతో దగ్ధమైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ (ఆపరేషన్స్) ఎన్. గంగాధర్ తెలిపారు. ఈ సంఘటనలో 49 హౌస్ సర్వీసులు, 9 హెచ్‌టీ, ఎల్టీ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయాయన్నారు. ఇళ్ల సర్వీసులు ఎవరికి వారే వేసుకోవలసి ఉన్నా మానవతా దృక్పథంతో పునరుద్ధరించడంతో పాటు కొత్త స్తంభాలు వేశామన్నారు. -
భయపెడుతున్న బ్లో అవుట్లు
1993 మామిడికుదురు మండలం కొమరాడలో బ్లో అవుట్ సంభవించి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో చమురు జల్లులు పడ్డాయి. నిప్పు తగలకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 1995 జనవరి 8న అల్లవరం మండలం దేవర్లంక (పాశర్లపూడి బావి) బ్లో అవుట్ సంభవించింది. ఇది కోనసీమలోనే అతిపెద్ద బ్లో అవుట్. 60 అడుగుల ఎత్తున అగ్నికీలలు ఎగిశాయి. 65 రోజుల పాటు మండుతూనే ఉంది. మంటల అదుపునకు అమెరికా నుంచి వచ్చిన నిపుణుల బృందం దీనిని ప్రపంచంలోనే రెండో పెద్ద బ్లో అవుట్‌గా పేర్కొంది. 80 ఇళ్లు, వంద ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.100 కోట్ల వరకూ నష్టం వాటిల్లింది. 1997 రావులపాలెం మండలం దేవరపల్లి బావిలో బ్లో అవుట్ సంభవించింది. 12 గంటల్లో మంటలను అదుపు చేశారు. 2005 అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి బావిలో బ్లో అవుట్ సంభవించింది. సాయంత్రానికల్లా మంటలను అదుపులోకి తెచ్చారు. 2011, 2012 రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. 2012లో రాజోలు మండలం కాట్రేని పాడు బావిలో బ్లో అవుట్ సంభవించింది. వెంటనే అదుపులోకి వచ్చింది. -అమలాపురం టౌన్ -
అధికారులపై చర్యలు తీసుకోండి
* గెయిల్ ఘటనపై హక్కుల సంఘం సాక్షి,హైదరాబాద్: గెయిల్ పేలుడు దుర్ఘటనపై మానవహక్కుల సంఘం(హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. పేలుడుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు వై. సోమరాజు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సంఘం అక్కడి గ్రామాల్లో ప్రజలకు జీవించే హక్కును కాపాడాలని స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. తమ ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ జూలై 10 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. -
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
* నేడు ఘటనాస్థలికి వైఎస్సార్సీపీ అధినేత సాక్షి, హైదరాబాద్: నగరం దుర్ఘటన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఆయన సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి.. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుని.. అనంతరం విమానంలో రాజమండ్రికి వెళతారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో ఘటనాస్థలికి చేరుకుంటారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే.. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఘటనకు దారితీసిన కార ణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోండి: రఘువీరారెడ్డి గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడులో బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు. భద్రతా లోపమే కారణం: వామపక్షాలు గ్యాస్‌పైప్ లైన్ పేలుడు దుర్ఘటన .. భద్రతా లోపంతోనే జరిగిందని సీపీఐ, సీపీఎంలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. టీ సీఎం కేసీఆర్ సంతాపం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ లీకేజీతో ఎగసిపడిన మం టల్లో పదహారు మంది సజీవ దహనం అయిన సంఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. * టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాల కృష్ణ, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కూడా పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
నగరం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: గెయిల్ పైపులైను పేలుడు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ, గెయిల్ నుంచి ఇచ్చే పరిహారానికి ఇది అదనమని పీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాల్సిందిగా పెట్రోలియంశాఖ మంత్రితోపాటు కేబినెట్ సెక్రెటరీ, గెయిల్ చైర్మన్లను ఆదేశించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కి శుక్రవారం ఉదయం ఓ సందేశం పంపారు. వెంటనే ప్రధానితో మాట్లాడా గ్యాస్‌పైప్‌లైన్ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే షాక్‌కి గురైనట్టు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రికి వివరాలను చెప్పడంతోపాటు తక్షణం సహాయ చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్లు తెలిపారు. ప్రమాద సంఘటన తెలిసి తాను ఒక్కసారిగా నిర్ఘాంత పోయినట్టు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటంపై కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కూడా ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం పైపులైను పేలుడు దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహాయ పునరావాస చర్యల పర్యవేక్షణకు సీఎం చంద్రబాబు, పెట్రోలియం శాఖ కార్యదర్శి సౌరబ్చంద్ర, గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి, ఓఎన్జీసీ ఛైర్మన్ డి.కె.సర్రాఫ్లతో కలిసి ప్రత్యేక విమానంలో ఏపీ వెళ్లారు. అంతకుముందు కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గెయిల్ పైపులైను పేలుడు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ద్వారా విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈడీ, ఆయిల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ డెరైక్టరేట్ (ఓఐఎస్డీ) ఈడీలతో పాటు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)సభ్యుడు నామినీగా ఉంటారని తెలిపారు. ఓఎన్జీసీ భద్రత కోసం రాజ్యాంగ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ పరిధిలోని ఓఐఎస్డీ చమురు, గ్యాస్ సంస్థల భద్రతకు సంబంధించిన డిజైనింగ్, నిర్వహణ, మరమ్మతు వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ విభాగానికి రాజ్యాంగపరమైన ఎలాంటి అధికారాలు లేవని తెలుస్తోంది. అప్పటి పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి ఓఐఎస్డీకి రాజ్యాంగ అధికారాలు కల్పించాలని చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ విషయాన్ని ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లగా ఓఐఎస్డీకి రాజ్యాంగ అధికారాలు కల్పించే దిశగా పనిచేస్తుందని బదులిచ్చారు. -
మృత్యు విస్ఫోటం
* పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ * 16 మంది దుర్మరణం * తూర్పుగోదావరి జిల్లా ‘నగరం’ గ్రామంలో దారుణం * 27 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం * కిలోమీటర్ పరిధిలో సర్వం బుగ్గి.. కోట్లలో ఆస్తి నష్టం * విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ: కేంద్రం * మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం * తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షలు * బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు అమలాపురం/మామిడికుదురు/కాకినాడ క్రైం: పచ్చని కోనసీమలో ప్రాణాంతకమైన చిచ్చు ప్రజ్వరిల్లింది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైపులైన్ ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. 30, 40 మీటర్ల ఎత్తులో కోరలుసాచి విరుచుకుపడ్డ దావాగ్ని కీలలు చూస్తుండగానే విధ్వంసం సృష్టించాయి. దాదాపు కిలోమీటరు పరిధిలో పచ్చని గ్రామాన్ని భస్మీపటలం చేయడమేగాక 16 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. మరో 27 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పెనుగులాడుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రచండ వేగంతో ఎత్తివచ్చిన పెను మంటల బారిన పడి పలువురు నిద్రలోనే నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు. ఇంకొందరు తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తుతూనే నిలువునా కాలిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఉదయం 5.10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాలం చెల్లిన పైప్ లైన్ కావడంతో గ్యాస్ ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయిందని చెబుతున్నారు. మంటల ధాటికి కిలోమీటర్ పరిధిలో పచ్చని కొబ్బరి తోటలు చూస్తుండగానే నిలువునా అంటుకున్నాయి. పావుగంట వ్యవధిలో కాలిపోయి మొండి మోడులై మిగిలాయి. పదుల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామంలోనూ, ఊరి మీదుగా వెళ్తున్న 218 నంబర్ జాతీయ రహదారిపైనా పలు వాహనాలు బూడిద కుప్పలుగా మిగిలాయి. పైపులైను పేలుడు జరిగిన ప్రాంతంలో ఏకంగా 10 అడుగుల గొయ్యి ఏర్పడింది. పేలుడు ధాటికి పైపులైన్‌పై కప్పిన కాంక్రీట్ గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పాక కూడా చాలాసేపు భూమిలోంచి పొగలు, వేడిగాలులు వచ్చాయి. పైగా మంటలను ఒకవైపు ఆర్పుతుండగానే అవి మరోవైపు చెలరేగుతూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలికి సమీపంలోనే ఉన్న ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ జీసీఎస్‌లకు మంటలు వ్యాపిస్తే పెను విధ్వంసమే జరిగి ఊరంతా శ్మశానప్రాయంగా మారేదే! కానీ అవి జీసీఎస్ మెయిన్ గేట్ దరిదాపుల వరకూ వ్యాపించి అక్కడితో ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చడమే గాక కోట్లలో ఆస్తి నష్టం కలగజేసిన ఈ ఘోరకలి లాభార్జనే తప్ప జనం భద్రత పట్టని చమురు సంస్థల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి రూ. 5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 50 వేలు తక్షణ సాయంగా అందిస్తామన్నారు. బాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. తామూ హై పవర్ కమిటీ వేశామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాబు ప్రకటించారు. అంతా క్షణాల్లో పైపులైను పేలుడు సంభవించిన సమయంలో గాలి ఉధృతంగా వీస్తుండడంతో ఆ ప్రాంతానికి పశ్చిమంగా అర కిలోమీటరు మేర క్షణాల్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఏం జరిగిందో తెలిసేలోపే పలువురు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మాడి మసైపోయాయి. ఆ సమయంలో స్థానికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు భీతిల్లి పరుగులు తీశారు. వారిని కూడా అగ్నిగోళాల్లాంటి మంటలు వెంటాడి గాయపరిచాయి. దూరంగా ఉన్నవారు అగ్నికీలల ఉగ్రరూపాన్ని చూసి కళ్లెదుటే తోటి మనుషులు తగలబడుతున్నా దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది, మరో ఇద్దరు ఉద్యోగులు, ఇతర కుటుంబాలకు చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి, కిమ్స్ ఆస్పత్రికి, రాజోలు ఏరియా ఆస్పత్రికి, రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలించారు. 80 శాతానికి పైగా గాయాలవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాలిన గాయాలతో వారు చేస్తున్న ఆర్తనాదాలు అందరి హృదయాలనూ కలచి వేస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక జ్యోత్స్నాదేవి అనే చిన్నారి కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విస్ఫోటం జరిగిన చోటికి సమీపంలో మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. స్కూళ్లు పనిచేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. 40 మీటర్ల ఎత్తుకు ఎగసిన కీలలు పైప్‌లైన్‌లో గ్యాస్ ఎగదన్నడంతో మంటలు బ్లో అవుట్ తరహాలో దాదాపు 40 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే జీసీఎస్ నుంచి గ్యాస్ సరఫరా నిలిపివేసినా అప్పటికే పైపులో ఉన్న గ్యాస్ వల్ల గంట పాటు మంటలు ఎగదన్నుతూనే ఉన్నాయి. అంతెత్తున ఎగసిపడే మంటలను పైపులైన్ వద్దకు వెళ్లి ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపటి వరకూ సాహసించలేకపోయారు. పెను విషాదంపై అలసత్వం గ్యాస్ విస్ఫోటనంపై చమురు సంస్థల అధికారులు గానీ, ప్రభుత్వాధికారులు గానీ చురుగ్గా స్పందించలేదు. ఉదయం 5.10కి ఘోరం జరిగినా 6.30 వరకూ అగ్నిమాపక శకటాలు రాలేదు. పక్కనే ఉన్న జీసీఎస్, మినీ రిఫైనరీల అగ్నిమాపక శకటాలు కూడా వెంటనే రంగంలోకి దిగకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. పోలీసులు తప్ప ఏ శాఖల అధికారులూ సకాలంలో స్పందించలేదు. చివరికి అగ్నిమాపక శకటాలు వచ్చి కొన్నిచోట్ల మంటలను అదుపు చేసినా, మరికొన్నిచోట్ల రాజుకుంటూనే ఉన్న మంటలను చూసీచూడనట్టు వదిలేశాయి. స్థానిక ఎమ్మెల్యేలు మండిపడడంతో వాటిని ఆర్పేందుకు ఉపక్రమించాయి. ప్రైవేటు చమురు సంస్థలు రవ్వ, రిలయన్స్‌లకు చెందిన శకటాలు వచ్చేసరికే మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రమాదంపై స్థానిక అధికారులు స్పందించలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాటిపాక ఓఎన్జీసీ జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఉపద్రవం జరిగిందని, తర్వాత కూడా వారు స్పందించలేదని ఆరోపిస్తూ స్థానికులు దానిపై దాడికి యత్నించారు. మెయిన్ గేట్‌ను దాటుకుని జీసీఎస్ వైపు దూసుకుపోయారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. సిబ్బంది వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. మంటలా, పేలుడా.. ఏది ముందు? ఈ ఘోరానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) నుంచి విజయవాడలోని ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు ‘గెయిల్’ సంస్థ గ్యాస్ సరఫరా చేస్తోంది. దీనికి సంబంధించిన పైపులైన్ నగరం గ్రామం వద్ద వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. ఆ విస్ఫోటంతో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై పరిసరాల్లో వ్యాపించింది. తర్వాత కొద్ది సమయానికే పైపులైన్ మరోసారి పేలిపోయింది. అప్పటికే చుట్టూ గ్యాస్ ఆవరించి ఉండడంతో రెప్పపాటు కాలంలోనే గ్రామాన్ని మంటలు చుట్టుముట్టాయి. సెకన్‌కు 40 కేజీల ఒత్తిడితో గ్యాస్ వెళ్తుండగా పైపులైన్ పేలిందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. రెండు పైపుల మధ్య జాయింట్ వద్ద ఈ పేలుడు సంభవించింది. సరిగ్గా ఇక్కడే మూడు నెలల క్రితం పైపులైన్ లీకైందని, అయినా గెయిల్ అధికారులు పట్టించుకోనందువల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే పైపులైన్ నుంచి గ్యాస్ లీకవుతూ వచ్చిందన్నది మరో కథనం. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుందని నగరం వాసులు పెద్దగా పట్టించుకోలేదు. అటు గెయిల్ అధికారులూ లీకేజీని గుర్తించలేదు. దీంతో ఆ ప్రాంతమంతా వాతావరణంలో గ్యాస్ కమ్ముకుంది. శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక హోటల్ యజమాని పొయ్యి వెలిగించబోగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు అంటుండగా, ఒక మహిళ ఇంట్లో పొయ్యి వెలిగించగానే విస్ఫోటం సంభవించిందని మరికొందరం టున్నారు. లీకైన తరువాత గాలి వాలు వల్ల ఓఎన్జీసీ జీసీఎస్ వైపు గ్యాస్ ఎక్కువగా వ్యాపించింది. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత అటు మళ్లింది. జీసీఎస్ ప్రధాన గోడకు 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. అదే జీసీఎస్లో జరిగి ఉంటే ఊరంతా శ్మశానంగా మారేదని స్థానికులు అంటున్నారు. పక్షులూబుగ్గయ్యాయి గ్యాస్ అలముకున్నాక మంటలు చెలరేగడంతో చెట ్లమీది పక్షులు సైతం తప్పించుకునే వీలులేక మసిబొగ్గుల్లా మిగిలాయి. 12 ఇళ్లు, ఒక సంస్థ కార్యాలయం, ఓ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధం కాగా, మరో పది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికుల వాహనాలతో పాటు గ్రామంగుండా వెళ్తున్న 216 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారి వాహనాలు సైతం తగలబడిపోయాయి. సుమారు 15 ఎకరాల్లో కొబ్బరి తోటలు కాలి బూడిదయ్యాయి. రూ.10 కోట్ల వరకు ఆస్తినష్టం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
మంటల్లో కోనసీమ
లాభాల యావే తప్ప భద్రత పట్టని చమురు కంపెనీలు అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం నుంచి అపారమైన చమురు, సహజవాయువులను తరలించుకుపోతున్న చమురు సంస్థలు అక్కడి ప్రజల భద్రతను పూర్తిగా గాలికొదిలేశాయి. స్థానికాభివృద్ధి పేరుతో అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటూ ప్రమాదాల నిరోధానికి కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడంలేదు. దీంతో కోనసీమ ఏ క్షణమైనా పేలే మందుపాతరలా మారిపోయింది. గత రెండు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో ఐదు బ్లో అవుట్లు సంభవించాయి. పదుల సంఖ్యలో పైప్‌లైన్ లీకేజీలు జరిగాయి. ఆ ఘటనల్లో కేవలం ఆస్తి నష్టాలే జరిగాయి. తాజాగా నగరంలో శుక్రవారం సంభవించిన గ్యాస్ పైపులైన్ పేలుడులో 16 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 27 మంది క్షతగాత్రులై విషమ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆక్రోశిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు గుప్పించడం, తరువాత ఆ విషయాన్ని గాలికి వదిలేయడం షరా మామూలైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల భద్రత గాలికి... కోనసీమ భూగర్భంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర చమురు సంస్థలకు చెందిన గ్యాస్ పైపులైన్లు ఉన్నాయి. 30కి పైగా చమురు బావులున్నాయి. తాటిపాకలో మినీ రిఫైనరీ, గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ఉన్నాయి. కేజీ బేసిన్ పరిధిలో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవ్వడం, ఆస్తి నష్టం వాటిల్లడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఓఎన్జీసీ గతంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. ఈ ప్రాంత భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువైనందున పైపులైన్లు త్వరగా తుప్పుపట్టి పాడైపోతాయని కమిటీ తేల్చి చెప్పింది. కనీసం ప్రతి ఏడేళ్లకోసారైనా పైపులైన్లను తప్పక మార్చాలని సూచించింది. అయితే ఈ నివేదికను ఓఎన్జీసీ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రైవేటు చమురు సంస్థల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. తాటిపాక గెయిల్ టెర్మినల్ పాయింట్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ సంస్థకు పైపులైన్ ద్వారా రోజుకు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఇందుకు 18 ఎం.ఎం. ట్రంక్ పైపులతో 15 ఏళ్ల కిందట పైప్‌లైన్ వేశారు. అధ్యయన కమిటీ సూచనల మేరకు దాన్ని ఇప్పటికి రెండుసార్లు మార్చాల్సి ఉండగా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మూడు నెలల కిందట గ్యాస్ లీకవ్వగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అప్పుడే పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పెనువిషాదం వాటిల్లేది కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బుగ్గి చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉత్తుత్తి ఉద్యమాల్లో నాయకులు ఈ ప్రాంత సహజ సంపదతో కోట్లు ఆర్జిస్తున్న చమురు సంస్థలు నిబంధనల ప్రకారం లాభాల్లో 2 శాతం ఆ ప్రాంతం అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంది. ఈ నిబంధన ను ఆ సంస్థలు ఏనాడూ నూరుశాతం అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రజలు దీనిపై పోరాటాలు చేస్తున్నా ఖాతరు చేయడంలేదు. ప్రజాప్రతినిధులు సైతం ఉత్తుత్తి ఉద్యమాలే చేసి ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
ఒకే నెలలో రెండు పెను విషాదాలు
ఒకే నెలలో సంభవించిన రెండు పెను విషాదాలు తెలుగువారికి అంతులేని ఆవేదన మిగిల్చాయి. పంచభూతాలైన నీరు, నిప్పు పగబట్టి 40 మంది తెలుగువారి ఉసురు తీశాయి. బియాస్ నది రూపంలో జలరక్కసి 24 మంది విద్యార్థులను కానరాని లోకాలకు తీసుకుపోయింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే కోనసీమ వాసులపై గ్యాస్ రూపంలో మృతువు కాటేసింది. నగరం గ్రామాన్ని నరకంగా మార్చేసి 16 మందిని మింగేసింది. విహారయాత్రకని వెళ్లిన 24 మంది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను హిమచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. కులుమనాలి సమీపంలో మండిలోని తలౌటి ప్రాంత్రం వద్ద జూన్ 8న జరిగిన ఈ ఘటన విద్యార్థులకు తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. తామెంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కంటిపాపలను క్షణాల్లో జలరక్కసి ఎత్తుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టేలోపే ప్రవాహంలోకి లాక్కుపోయింది. బియాస్ విషాదం తాలుకూ తడి ఆరకముందే తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామాన్ని శుక్రవారం (జూన్ 27న) ఉదయం మృత్యుజ్వాల కమ్మేసింది. గ్యాస్ రూపంలో 16 మందిని మసి చేసింది. నిలువెల్లా కాల్చేసి బూడిద మిగిల్చింది. అన్నెంపున్నెం ఎరుగని పల్లెవాసుల శరీరాలను ఛిద్రం చేసి 15 మందిని ఆస్పత్రి పాల్జేసింది. రక్కసి కీలలకు ఇంకా ఎంత మంది బలౌతారోనని బాధిత కుటుంబాలు భీతిల్లుతున్నాయి. బియాస్, నగరం విషాదాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. హిమచల్ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించి బియాస్ దుర్ఘటనకు కారణమయ్యారు. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం నగరం ప్రజల పాలిట మృత్యుజ్వాలగా మారింది. బియాస్ నదిలో గల్లంతైన కొంత మంది విద్యార్థుల శవాలు ఇంకా దొరక్కపోవడం విషాదంలో విషాదం. నగరం ఘటనలో కళ్లెదుటే 16 మంది కాలి బూడిదయిపోవడం గుండెలు పిండేసే విషాదం. పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కొనసాగినంతకాలం ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. -
కోనసీమలో మరో బ్లో అవుట్
-
కోనసీమ గుండెలపై ఆరని బ్లో అవుట్
-
రేపు నగరం గ్రామానికి వైఎస్ జగన్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గెయిల్ పైపులైను పేలుడు సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం, సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటనపై విచారణ జరిపించాలని జగన్ కోరారు. కాగా, శనివారం నాడు నగరం గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కాగా.. క్షతగాత్రుల్లో ఎనిమిదిమందిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వారిని కాపాడేందుకు వైద్యబృందాలు శ్రమిస్తున్నాయి. మరోవైపు రాజోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మరణించారు. క్షతగాత్రులలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
కోనసీమ గుండెలపై ఆరని బ్లో అవుట్
అటూ ఇటూ పచ్చటి పంటపొలాలు, అరటి, కొబ్బరితోటలతో అలరారే కోనసీమలో గ్యాస్ పైపులైన్లు గుండెలమీద కుంపటిలా ఉన్నాయి. పదేపదే ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నా, అధికారులు మాత్రం శాశ్వత చర్యలు చేపట్టిన పాపాన పోవట్లేదు. ఈమధ్యే కొన్నిసార్లు పైపులైన్ లీకేజి వచ్చింది. అయినా దాన్ని పట్టించుకోకపోవడం వల్లే మామిడికుదురు మండలం నగరం వద్ద తాజా ప్రమాదం కూడా జరిగింది. ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను పేలడం వల్లే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. గతంలో లీకేజి వచ్చినా కూడా మొత్తం పైపులైనును పరిశీలించాల్సింది పోయి.. కేవలం అక్కడికక్కడ మాత్రమే మరమ్మతులు చేసి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రమాదంలో మంటలను కొంతవరకు అదుపులోకి తెచ్చారు. మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. దాదాపు 20 మీటర్ల మేర పైపులైన్ పగిలిపోయింది. 200 కొబ్బరిచెట్లు మంటల్లో మొదలు దగ్గర్నుంచి పూర్తిగా కాలిపోయాయి. సమీపంలో ఉన్న ఇళ్లు కూడా కాలిపోయాయి. ఒకే ఇంట్లోని ముగ్గురు సజీవంగా దహనమయ్యారు. కొబ్బరిచెట్లు కాలిపోవడం, ఇళ్లపై కూడా ప్రభావం ఉండటంతో ఈ ప్రాంతమంతా భయానకంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం సంభవించడంతో ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోయింది. గాయపడిన వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని రాజోలు ఆస్పత్రికి తరలించారు. 1993లో మామిడికుదురు మండలం కొమరాడలో తొలిసారిగా బ్లోఅవుట్ సంభవించింది. ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్ పాశర్లపూడి 19 స్ట్రక్చర్ పరిధిలో 1995లో అల్లవరం మండలం దేవర్లంకలో సంభవించింది. ఈ బ్లో అవుట్ రావణాకాష్టంలా రగులుతూ 65 రోజుల పాటు అందరినీ అష్టకష్టాల పాలు చేసి, చివరకు విదేశీ నిపుణుల సహకారంతో అదుపులోకి వచ్చింది. 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లోఅవుట్ సంభవించి దానంతట అదే ఆరిపోయింది. 2005 సెప్టెంబర్‌లో పాశర్లపూడి స్ట్రక్చర్‌లోని తాండవపల్లిలో మరోసారి బ్లో అవుట్ సంభవించి కోనసీమ వాసుల గుండెలపై కుంపటి చిచ్చురేపింది.