1993
మామిడికుదురు మండలం కొమరాడలో బ్లో అవుట్ సంభవించి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో చమురు జల్లులు పడ్డాయి. నిప్పు తగలకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
1995
జనవరి 8న అల్లవరం మండలం దేవర్లంక (పాశర్లపూడి బావి) బ్లో అవుట్ సంభవించింది. ఇది కోనసీమలోనే అతిపెద్ద బ్లో అవుట్. 60 అడుగుల ఎత్తున అగ్నికీలలు ఎగిశాయి. 65 రోజుల పాటు మండుతూనే ఉంది. మంటల అదుపునకు అమెరికా నుంచి వచ్చిన నిపుణుల బృందం దీనిని ప్రపంచంలోనే రెండో పెద్ద బ్లో అవుట్‌గా పేర్కొంది. 80 ఇళ్లు, వంద ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.100 కోట్ల వరకూ నష్టం వాటిల్లింది.
1997
రావులపాలెం మండలం దేవరపల్లి బావిలో బ్లో అవుట్ సంభవించింది. 12 గంటల్లో మంటలను అదుపు చేశారు.
2005
అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి బావిలో బ్లో అవుట్ సంభవించింది. సాయంత్రానికల్లా మంటలను అదుపులోకి తెచ్చారు.
2011, 2012
రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. 2012లో రాజోలు మండలం కాట్రేని పాడు బావిలో బ్లో అవుట్ సంభవించింది. వెంటనే అదుపులోకి వచ్చింది.
-అమలాపురం టౌన్
భయపెడుతున్న బ్లో అవుట్లు
Published Sat, Jun 28 2014 1:45 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement