నగరం విషాదం మరవక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
కాకినాడ: నగరం విషాదం మరవక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తాటిపాక ఓఎన్‌జీసీ రిఫైనరీలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ లీకేజితో స్థానికులు బెంబేలెత్తారు. లీకేజీని ఆపేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, నగరం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి పొగవస్తున్న ప్రాంతాన్ని తాటిపాక ప్లాంట్ ఇంచార్జ్ విక్రాంత్ పరిశీలించారు. పైప్‌లైన్ తుప్పుబట్టి ఉండడంతోనే గ్యాస్ లీకవుతుందని ఆయన తెలిపారు. నిప్పు ఉంటే ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు.
నగరం గ్యాస్ పైపు పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న
తాటికాయల రాజ్యలక్ష్మి(25) ఆదివారం మృతి చెందింది.