![గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71403886489_625x300_0.jpg.webp?itok=DSw7qMu0)
గ్యాస్ పేలుడు బాధితుల్ని ఆదుకోవాలి: చాడా
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పేలుడు దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పేలుడు జరిగిందని, బాధితులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా సరిపోదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్యాస్ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.