
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద శుక్రవారం ఉదయం మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో సింగూరు జలాలు గ్రామాన్ని ముంచెత్తాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. సమీపంలోని పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు రావడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి.
కోళ్లు, రెండు గొర్రెలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని పొలాల్లోకి నీరు చేరడంతో రైతులకు నష్టం వాటిల్లింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. అందుకు పైప్‌లైన్ పనులు చేస్తున్న కంపెనీ అంగీకరించడంతో ఆందోళన విరమించారు. – నిజాంసాగర్