ప్రసూతి మరణాలపై హెచ్చార్సీలో ఫిర్యాదు
Published Thu, Apr 27 2017 12:59 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: ప్రసూతి ఆస్పత్రుల్లో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేతలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు గాంధీభవన్ నుంచి మానవ హక్కుల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రసూతి ఆస్పత్రుల్లో మరణాలు ప్రభుత్వ హత్యలే అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, ఆకుల లలిత, నేరేళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement