
అమాయకులపై థర్డ్ డిగ్రీనా?
హైదరాబాద్: సిరిసిల్ల మండలం తంగెపల్లికి చెందిన ఆరుగురిని తీవ్రంగా చిత్రహింసల పాలు చేసిన పోలీసులను విచారణకు హాజరుకావాలని హెచ్చార్సీ ఆదేశించింది. ఇసుక రవాణాకు అడ్డు నిలుస్తున్నారంటూ గ్రామంలోని ఓ కుంటుంబానికి చెందిన ఆరుగురిపై సిరిసిల్ల పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. వారిని తీవ్రంగా కొట్టడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బాధిత కుటుంబీకులు డీఐజీకి కూడా ఫిర్యాదు చేశారు.
మంగళవారం వారు హైదరాబాద్ కు వచ్చి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. చిత్ర హింసలు పెట్టిన ఎస్పీతో పాటు ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకునే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. స్పందించినా హెచ్చార్సీ సెప్టెంబర్ 13వ తేదీన హాజరు కావాలని సిరిసిల్ల పోలీసులను ఆదేశించారు.