ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్నేషనల్ అనే ట్యాగ్ లైన్లను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు వాడుతూ పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.కిరణ్ కుమార్ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
నాంపల్లి (హైదరాబాద్) : ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్నేషనల్ అనే ట్యాగ్ లైన్లను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు వాడుతూ పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.కిరణ్ కుమార్ మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్యాగ్‌లు అక్రమంగా వాడుకుంటున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
జీవో నంబర్-91 ప్రకారం రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ జరగాలని, జీవో నంబర్-42 ప్రకారం పాఠశాలలు ఫీజులు వసూలు చేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా నిబంధనలను వర్తింపజేయాలని కోరారు. సెలవు దినాలు, అదనపు పనిగంటల విషయంలో యాజమాన్యాలు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ జులై 20వ తేదీన నాటికి సమగ్రమైన నివేదికను సమర్పించాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.