పుష్కర ఘాట్ లో 29 మంది మరణాలకు కారకుడైన చంద్రబాబుపై చర్యలు కోరుతూ హెచ్చార్సీలో ఫిర్యాదు నమోదైంది.
హైదరాబాద్: ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు వీఐపీ ఘాట్ లో కాకుండా సామాన్య భక్తుల కోసం కేటాయించిన ఘాట్ లో పూజలు నిర్వహించడంవల్లే రాజమండ్రిలోని పుష్కర ఘాట్ లో తొక్కసలాట సంభవించి 29 మంది దుర్మరణం చెందారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించాలని న్యాయవాది సుధాకర్ రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని హెచ్చార్సీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు.