
నాంపల్లి: ‘అధికారుల నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణ సంకటం’ గా మారిందంటూ సాక్షి దినపత్రిక కూకట్‌పల్లిలో ఈ నెల 10న వెలువడిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ స్థానిక ప్రజలు, కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం పట్ల విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానందనగర్ అపార్ట్‌మెంట్స్, అల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, సుమిత్రానగర్, పాపిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మార్చి 18కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment