sumoto case
-
బాబుపై సుమోటో కేసులేవీ పవన్?: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు మూడు నాలుగు రోజులు అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైయస్సార్సీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు.అక్రమ కేసులు బనాయించిన అధికారులను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ చెప్పారు. అక్రమ కేసులు బనాయించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చి వెళ్లినా.. రిటైర్ అయిపోయిన వదిలే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. అధికారులను బెదిరించడం ఏమిటని పవన్ మాట్లాడుతున్నారు. అంటే పవన్ కల్యాణ్ మమ్మల్ని బెదిరిస్తున్నారా?. మీ బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ లేరు.అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితేనే వైఎస్ జగన్ భయపడలేదు. పెద్దపెద్ద వాళ్లతో ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలుపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా.. అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు...సుధారాణిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొట్టారు.మాజీమంత్రి విడుదల రజనిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. మాటలతో చెప్పుకోలేని విధంగా ఆమెను దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన ముగ్గురు అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌లో ఉన్న 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సూపర్ సిక్స్, ఉచిత ఇసుక ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పోలీసులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నా నోటితో నేను చెప్పలేను’’ అని అన్నారు. -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్‌కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్‌మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్‌కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్‌కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్‌పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్‌బగాన్, ఈస్ట్‌బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కోల్‌కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్‌కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్‌కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్‌తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్‌ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్‌కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్‌కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్.. సదరం స్కాంపై ఏసీబీ కేసు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ‘దివ్యంగా దోచేస్తున్నారు’శీర్షికన తొలిసారిగా ఈ కుంభకోణాన్ని ‘సాక్షి’వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సదరం సర్టిఫికెట్లు తీసుకున్న పలువురు అనర్హులు ప్రతినెలా దివ్యాంగ పింఛన్లు, బస్, రైలు పాసుల్లో రాయితీలు, ఏటా ఆదాయపు పన్ను రాయితీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టాన్ని చేకూరుస్తున్నారు. జిల్లా సివిల్ ఆసుపత్రికి నోటీసులు! రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని చేకూరుస్తున్న ఈ కుంభకోణంపై ఏసీబీ అధికారులు ఇప్పటికే డీఆర్డీఏ అధికారులకు కొన్ని ప్రశ్నలతో కూడిన నోట్‌ను పంపారు. దానికి వారి నుంచి సమాధానం రాగా తాజాగా కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సైతం నోటీసులు పంపించారు. ఇక్కడనుంచి వచ్చే సమాధానాల ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో జారీ అయిన పలు అనుమానాస్పద సర్టిఫికెట్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అసలేం జరిగింది..? కరీంనగర్‌లోని జిల్లా సివిల్ ఆస్పత్రి– కలెక్టరేట్లో డీఆర్డీఏలోని కొందరు అధికారులు కలిసి అనర్హులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే తతంగానికి తెరలేపారు. వీరంతా పలు మండలాల్లో ఏజెంట్లను, తమకు అనుకూలమైన వైద్యులతో ముందే మాట్లాడుకుని వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారు అడిగినంత వైకల్య శాతాన్ని వేసి పంపేవారు. ఇందుకోసం సదరం వ్య వహారాలు చూసే ఇద్దరు డీఆర్డీఏ ఉద్యోగుల (శ్రీనివా స్, కిశోర్)ను పెట్టుకున్నారు. వాస్తవానికి వీరిని 2019 లోనే డీఆర్డీఏ తొలగించగా..ఈ వ్యవహారంలో ఉన్న పూర్వానుభవంతో ఎలాంటి నియామక పత్రాలు లేకున్నా..26 నెలలపాటు శ్రీనివాస్, కిశోర్‌తో సివిల్ ఆసుపత్రిలో దందా చేయించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా ఉన్నారు. -
వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేంటి?
సాక్షి, విశాఖ: వాలంటీర్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాగాన్ని పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేయటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయకుండా ఎన్నికల కమిషనర్‌ను నియంత్రించాలని ఆయన కోరారు. కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని జోస్యం చెప్పారు. -
సాక్షి కథనాన్ని సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ
నాంపల్లి: ‘అధికారుల నిర్లక్ష్యం... ప్రజలకు ప్రాణ సంకటం’ గా మారిందంటూ సాక్షి దినపత్రిక కూకట్‌పల్లిలో ఈ నెల 10న వెలువడిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ స్థానిక ప్రజలు, కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం పట్ల విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివేకానందనగర్ అపార్ట్మెంట్స్, అల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, సుమిత్రానగర్, పాపిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మార్చి 18కి వాయిదా వేసింది. చదవండి: యూటర్న్ తీసుకుని వచ్చి మరీ మంత్రి పరామర్శ -
వలస కూలీల పరిస్థితిపై స్పందించిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వలస కూలీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో కూలీలను ఆదుకునేందుకు, వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏంటో తమకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. (కరోనా: రాజకీయ సంక్షోభం తప్పదా..!) ప్రస్తుతమున్న గడ్డు కాలంలో ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని పోయిన వలస కూలీలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. కూలీల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల వివరాలను తమకు సమర్పించాలని కోరుతూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. (యూఎస్ లాంటి పరిస్థితి తీసుకురావద్దు: హైకోర్టు) కాగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఉపాధి లేక తింటానికి తిండిలేక బిక్కుబిక్కుమంటూ కాలాన్నీ వెళ్లదీశారు. ఈ క్రమంలోనే చాలామంది నడుచుకుంటూ స్వస్థలాలకు బయలుదేరి.. మార్గంమధ్యంలోనే కన్నుమూశారు. దీంతో కేంద్రం స్పందించి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. అయినా కూడా చాలామంది కూలీలు ఇంకా కాలిబాటన స్వస్థలాలకు వెళ్తున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వలస కూలీల దుస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. -
నిర్భయ నిధుల పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ.. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. తమ పిల్లలో, ఇంట్లోని మహిళలో కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలుసుకోవాలని ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనన్న నిర్లక్ష్యపూరిత జవాబే ఎక్కువగా పోలీసుల నుంచి వస్తోందని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించింది. ‘హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్‌చేసి, చంపేసి, మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో’ అని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. నిర్భయ నిధి సహా మహిళల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలను.. రాష్ట్రాలు, యూటీల్లో వాటి అమలును సమగ్ర నివేదిక రూపంలో తమకు అందించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు -
‘సిలికా’ పరిహారంపై సుమోటో పిల్
సాక్షి, హైదరాబాద్: సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారిన పడిన వారికి తగిన నష్టపరిహారం అందించాలన్న తమ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదంటూ పత్రిక ల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందిం చింది. ఈ కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లు, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొంది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరపనుంది. రంగారెడ్డి జిల్లాలోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం వల్ల పలువురు మృత్యువాత పడ్డా రు. దీనిపై హైకోర్టులో 2013లో పిల్ దాఖ లైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా అప్ప టి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సిలికా బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరోవైపు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉస్మానియా ఆస్పత్రికి ఉన్న స్థలా న్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. దీనిపై కూడా సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది. -
ప్రత్యూష పెదనాన్నను కోర్టులో హాజరుపరచండి
హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూష కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు గురువారం హైకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటుందని, ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పరారైన తండ్రి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో సరైన సమయంలో స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, వైద్యం అందించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు ఈ సందర్భంగా అభినందించింది. అలాగే ప్రత్యూష ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడుంటుందో తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆమెతో మాట్లాడి నివేదిక సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యూష పెదనాన్నను శుక్రవారం కోర్టులో హాజరు పరచాలని కోర్టు సూచించింది. మరోవైపు ప్రత్యూష తండ్రి రమేష్ ను గతరాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. -
ఎమ్మార్వోపై దాడి: సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్చార్సీ
-
పెనుకొండ దుర్ఘటనపై సుమోటో కేసు
అనంతపురం: పెనుకొండ బస్సు ప్రమాదంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీరియస్ అయింది. బస్సు దుర్ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదుచేసింది. పోలీసు, కాంట్రక్టర్, ఆర్టీసీ, ఆర్ అండ్ బి అధికారులకు జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు నోటీసులు జారీ చేశారు. ఈ నెల24న విచారణకు హాజరుకావాలని జిల్లా కోర్టు వారిని ఆదేశించారు. అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడిన తెలిసిందే. -
భూ బకాసురులపై సుమోటో కేసు నమోదు చేయాలి
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు రూరల్: పేదల భూములను ఆక్రమించుకుంటున్న భూ బకాసురులపై సుమోటో కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీలు పేద ప్రజలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని బలవంతులైన అధికారపార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని రాజంపేట ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. అయినప్పటికీ భూముల ఆక్రమణ ఆగలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నింటికీ ఆధార్ లింక్ చేసినట్లే డీకేటీ భూములకు కూడా లింక్ చేయాలన్నారు. ఈ భూముల ఆక్రమణపై కలెక్టర్, అసెంబ్లీ సీఎస్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఓబులవారిపల్లె మండలం గాదెలకు చెందిన మాజీ సర్పంచ్ రామక్రిష్ణయ్యకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిని కూడా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ అక్రమాలపై డిసెంబరు 5వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ క్షత్రియ నాయకుడు ముప్పాల హేమనవర్మ, జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, మాజీ జెడ్పీటీసీ బండారు సుభద్రమ్మ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆర్వీ రమణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బిల్లును తగులబెట్టినవారిపై సుమోటోగా కేసు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీఆర్ఎస్ వినతి సాక్షి, హైదరాబాద్: శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగులబెట్టిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్టు టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి పంపిన బిల్లును భోగిమంటల్లో తగులబెట్టడంద్వారా రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బిల్లు ముసాయిదాను తగులబెట్టాలంటూ పిలుపునిచ్చిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై, బిల్లు ప్రతులను తగులబెట్టిన నేతలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
హవ్వ.. ఇదేం సర్కార్!
సిద్దిపేట, న్యూస్‌లైన్: నోటితో ఊరడిస్తూ నొసటితో వెక్కిరించడమంటే ఇదే! రైతులు బాగుండాలని, రైతే రాజని రోజూ వక్కాణించే ప్రభుత్వం వారిపై కక్షగట్టింది. నేలతల్లినే నమ్ముకొని సమాజానికి పట్టెడన్నడం పెడుతున్న అన్నదాతలను వేధిస్తోంది. కేవలం పదిహేను నిమిషాలు రోడ్డెక్కి గొంతెత్తినందుకు కేసులు పెట్టారు. ఠాణా, కోర్టు చుట్టూ తిప్పడానికి కాగితాలను సిద్ధం చేశారు. రోడ్డెక్కడానికి నేపథ్యమిది... అది గత అక్టోబరు చివరి వారం. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు పలువురు రైతులు తీసుకొచ్చిన మక్కల్ని మార్క్‌ఫెడ్ ఓకే చేసింది. కానీ..పది రోజులైనా తూకం వేయక..రశీదులివ్వక తీవ్ర జాప్యం చేసింది. మరోవైపు అకాల వర్షాలతో మొక్కజొన్నలు తడిసి మొలకెత్తి పంట ఉత్పత్తిదారుల కంటిమీద కునుకును దూరం చేశాయి. అటు ఇళ్లకు వెళ్లలేక ఇటు మార్కెట్లో పని పూర్తవక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయారు. దీంతో గత్యంతరం లేక అక్టోబరు 28న యార్డు దగ్గర్లోని రోడ్డుపైకి వచ్చి కాసేపు ఆందోళన చేశారు. రెండు గంటల్లో సరుకులను తరలిస్తామని పోలీసుల సమక్షంలో అధికారులు మాటిచ్చారు. అందుకు నాలుగు గంటలు దాటినా ఎవరూ పత్తాలేకుండా పోయారు. దాంతో జిల్లా పాలనా యంత్రాంగాన్ని కదిలించాలన్న ఉద్దేశంతో సమీపంలోని రాజీవ్ రహదారిపైకి చేరారు రైతులు. పావుగంటపాటు రాస్తారోకో చేశారు. అదే పాపమైందట... బాధితులు రైతు నేతలతో కలిసి రాజీవ్హ్రదారి మీదకు చేరాల్సిన అగత్యాన్ని ఒక రకంగా వారే సృష్టించారు. ఇంతలా నిర్లక్ష్యం ఆవహించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు చేతకాని పాలకులు...రోడ్డెక్కడమే పాపమైనట్లు రైతులపై కేసులు కట్టించారు. రాకపోకలకు ఆటంకం కలిగించాలని రైతులకు మాత్రం ఎందుకుంటుంది? వాళ్లు నిరసనకు దిగడానికి నేపథ్యాన్ని, మానవీయతను సర్కారు విస్మరించింది. 16 మందిపై కేసులు పావుగంటపాటు రాస్తారోకో చేసి ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం, వాహనాలను అడ్డుకోవడం చట్ట విరుద్ధమంటూ 188, 341 సెక్షన్ల కింద 16 మందిపై సిద్దిపేట టూటౌన్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. నర్సింహులు, నర్సయ్య, హన్మంతరెడ్డి, రామలింగారెడ్డి, రవీందర్‌రెడ్డి, భైరవరెడ్డి, రామచందర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, భూపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కమలాకర్‌రావులు ఆ జాబితాలో ఉన్నారు. వీరిని సోమవారం పోలీసుస్టేషన్‌కు రావాలని ఆజ్ఞాపించారు. సుమోటోగా కేసులు.. హైదరాబాద్-రామగుండం రాజీవ్హ్రదారిపై రాస్తారోకో చేసి రాకపోకలకు ఆటంకం కలిగించారు. అందుకే 16 మందిపై సమోటో(తమంతట తాము)గా కేసులు నమోదు చేశాం. వారిని సోమవారం పోలీసు స్టేషన్‌కు రమ్మన్నాం. ష్యూరిటీలతో వస్తే స్టేషన్ బెయిలిస్తాం. - సైదులు, టూటౌన్ సీఐ, సిద్దిపేట