అనంతపురం: పెనుకొండ బస్సు ప్రమాదంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీరియస్ అయింది. బస్సు దుర్ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదుచేసింది. పోలీసు, కాంట్రక్టర్, ఆర్టీసీ, ఆర్ అండ్ బి అధికారులకు జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు నోటీసులు జారీ చేశారు.
ఈ నెల24న విచారణకు హాజరుకావాలని జిల్లా కోర్టు వారిని ఆదేశించారు. అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడిన తెలిసిందే.