రైతు ఆత్మహత్యలపై సమాచారం అందించాలంటూ హెచ్చార్సీ తెలంగాణ టీడీపీని కోరింది.
రైతు ఆత్మహత్యలపై సమాచారం అందించాలంటూ హెచ్చార్సీ తెలంగాణ టీడీపీని కోరింది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించాలని కోరుతూ కొంతకాలం క్రితం తెలంగాణ టీడీపీ నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఈ మేరకు స్పందించిన మానవ హక్కుల సంఘం తమకు మరింత సమాచారం అందించాలని కోరుతూ బుధవారం టీడీపీకి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించారు. హెచ్చార్సీ కోరిన మేరకు సమాచారం అందించేందుకు సంసిద్ధత ప్రకటించారు. వెంటనే అందజేస్తామన్నారు.