తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అకారణంగా కొట్టారని వైఎస్ఆర్ సిపి నేతలు మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సి)ను ఆశ్రయించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయానికి నిరసన తెలుపుతూ, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిదు రోజుల తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురువారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర ఆందోళనకు గురైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు అకారణంగా వారిని కొట్టారని పార్టీ నేతలు హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. హెచ్ఆర్సి విచారణకు ఆదేశించింది.