'విద్యార్థులకు న్యాయం చేయండి' | cpi demands justice for Street Children's School students in hrc | Sakshi
Sakshi News home page

'విద్యార్థులకు న్యాయం చేయండి'

Published Tue, Jun 30 2015 6:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

cpi demands justice for Street Children's School students in hrc

హైదరాబాద్(నాంపల్లి): నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 22లో కూల్చివేసిన వీధి బాలల స్కూల్ విద్యార్థులకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్‌కు పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి. సుధాకర్, సామాజిక మహిళా కార్యకర్త శోభారాణిలు ఈ ఫిర్యాదు చేశారు. ఈమేరకు నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పెదపేరిరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వీధి బాలల స్కూల్ జూబ్లీహిల్స్‌లో ఉండటానికి వీలు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశాన్ని చూపించాలని, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా స్కూలును ఈ నెల 27న అర్థరాత్రి కూల్చివేయడం దారుణమని వివరించారు.

ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్సీ జులై 13వ తేదీలోగా స్కూలు కూల్చివేతకు కారణాలను తెలియజేస్తూ నివేదికను అందజేయాలని డీఈఓ సోమిరెడ్డికి, షేక్‌పేట్ తహసీల్దార్ చంద్రకళను ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement