peda peri reddy
-
'విద్యార్థులకు న్యాయం చేయండి'
హైదరాబాద్(నాంపల్లి): నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 22లో కూల్చివేసిన వీధి బాలల స్కూల్ విద్యార్థులకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్కు పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి. సుధాకర్, సామాజిక మహిళా కార్యకర్త శోభారాణిలు ఈ ఫిర్యాదు చేశారు. ఈమేరకు నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పెదపేరిరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వీధి బాలల స్కూల్ జూబ్లీహిల్స్లో ఉండటానికి వీలు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశాన్ని చూపించాలని, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా స్కూలును ఈ నెల 27న అర్థరాత్రి కూల్చివేయడం దారుణమని వివరించారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ జులై 13వ తేదీలోగా స్కూలు కూల్చివేతకు కారణాలను తెలియజేస్తూ నివేదికను అందజేయాలని డీఈఓ సోమిరెడ్డికి, షేక్పేట్ తహసీల్దార్ చంద్రకళను ఆదేశించింది. -
హక్కుల ఉల్లంఘనను ఉపేక్షించం: పేరిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పౌరులకు పూర్తిస్థాయిలో అందాలని, హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) సభ్యుడు కాకుమాను పెద పేరిరెడ్డి స్పష్టంచేశారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కమిషన్ కార్యాలయం ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బాధితులకు సత్వర న్యాయంకోసం యత్నిస్తున్నామని, అందినరోజే ఫిర్యాదులను పరిశీలించి, తగిన ఉత్తర్వులు ఇస్తున్నామన్నారు. పోలీసుల తీరుపై, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 11,298 ఫిర్యాదులు అందగా వాటిలో7,073 ఫిర్యాదులను విచారణకు స్వీకరించామన్నారు.