సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు | a complaint filed in HRC on police commissioner cv anand | Sakshi
Sakshi News home page

సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Published Tue, Dec 24 2013 3:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

సైబరాబాద్ కమిషనర్ ఆనంద్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్: సైబరాబాద్ సీపీ ఆనంద్ తన భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ నేత శంకర్ రెడ్డి హెచ్ఆర్సీసీని ఆశ్రయించారు. తనకున్న ఐదెకరాల భూమిని బంధువులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ డీజీపీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 6లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

 

సోమవారం సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆనంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కమల కుమారి అనే మహిళ కోర్టుకు తెలిపారు.  కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.సీవీ ఆనంద్‌ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరయ్యేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement