Shankar Reddy
-
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్‌రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్‌కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
కొత్త ‘ఎత్తిపోతల’ అంచనాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎత్తిపోతల పథకాలపై సమగ్ర అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్, నిజామాబాద్, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని కొత్త ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.250 కోట్ల అంచనాలకు త్వరగా అనుమతులు పొందాలన్నారు. గురువారం ఐడీసీ ఎండీగా శ్యామ్‌సుందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్‌రెడ్డి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో స్థానిక రైతులను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. -
కమ్యూనిస్టులా... కరప్షనిస్టులా..?
టవర్‌సర్కిల్ (కరీంనగర్): ఒకప్పుడు ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టులంతా కరెప్షనిస్టులుగా మారారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఐ పోరుబాట సభలో వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. 60 రోజులపాటు సాగిందని చెబుతున్న పోరుబాటలో ప్రజల నుంచి వారికి స్పందన కరువైందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోరాటాలు చేస్తూ ఏం సాధించారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ సాధించారని అన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్, టీడీపీలు వామపక్షాలకు మద్దతు ఎలా ఇచ్చారని, వామపక్ష ధోరణులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ప్రజల్లో వామపక్షాలపై అంతో ఇంతో ఉన్న అభిమానం కొరవడే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ను విమర్శించే అర్హత ఎవరికీ లేదని, చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. -
తుపాకీ ఘటనలో..చీకటి కోణాలెన్నో!
♦ నిందితులు, ఫిర్యాదు దారులంతా గతంలో ఒకే ముఠా ♦ పొలిటికల్, పోలీస్ అధికారులకు అమ్మాయిల ఎర ♦ కొందరి రాసలీలలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్న వైనం ♦ భర్త లేని ఒంటరి మహిళలే లక్ష్యంగా దందాలు ♦ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న చీకటి బాగోతాలు ♦ శంకర్‌రెడ్డి, విజయభాస్కర్రెడ్డిలను కోర్టులో హాజరుపరచిన పోలీసులు రాజధాని ప్రాంతమైన గుంటూరులో వెలుగుచూసిన తుపాకీ చిక్కుముడి ఇంకా వీడలేదు. రెండు రోజులైనా తుపాకీ ఎవరిది.. ఎక్కడ నుంచి వచ్చింది.. అసలు దాని వెనుక ఉన్న కథ ఏమిటి.. అనే విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చలేకపోయారు. అయితే నిందితులతో పాటు ఫిర్యాదు దారులంతా గతంలో ఒకే ముఠా అని తేలింది. పోలీసుల విచారణలో కళ్లు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. సాక్షి, గుంటూరు : గుంటూరులో రెండు రోజుల క్రితం తుపాకీ సహా లొంగిపోయిన విజయభాస్కరరెడ్డి ఘటన వెనుక చాలా పెద్ద వ్యవహారమే ఉందని తెలుస్తోంది. దీని వెనుక రాజకీయ నేతలు, పోలీసు అధికారులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి వారి రాసలీలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వాటిని బూచిగా చూపి ఈ ముఠా తమ పనులు చక్కబెట్టుకున్నట్టు సమాచారం. అయితే పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను హఠాత్తుగా తెరపైకి తేవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఠా సభ్యుల మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అన్నీ చిక్కుముడులే... చలసాని ఝాన్సీ అనే మహిళను చంపమని తనకు శనగా సోమశంకర్‌రెడ్డి తుపాకీ ఇచ్చాడని, ఆమెను చంపకపోతే తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని మోదుగుల విజయ భాస్కరరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 15వ తేదీ రాత్రి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. దీన్ని పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు వెలికితీయాలని న్యాయమూర్తి తేజోవతి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో 16న సోమశంకర్‌రెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో మోదుగుల విజయభాస్కరరెడ్డితో పాటు సోమశంకర్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రెండు రోజులు గడిచినా తుపాకీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మాత్రం తేలలేదు. ఝాన్సీని సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకుని పంపివేశారు. అయితే మోదుగుల విజయభాస్కరరెడ్డి చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్‌లో తుపాకీ ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు దాచి ఉంచారు.. పదేళ్ల క్రితం ముగిసిన ఝాన్సీ వివాదం ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది అనే అనుమానాలూ కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా తమ మధ్య వివాదాలు నడుస్తున్న తరుణంలో శత్రువైన విజయభాస్కరరెడ్డికి సోమశంకర్‌రెడ్డి తుపాకీ ఎందుకు ఇస్తాడనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. తుపాకీ తీసుకున్న వెంటనే లొంగిపోకుండా విజయభాస్కరరెడ్డి మూడు నెలల తరువాత లొంగిపోవడంలో ఆంతర్యం ఏమిటి అనే అనుమానాలూ కలుగుతున్నాయి. ఇద్దరిపైనా కేసులు నమోదు... తుపాకీ ఎవరిది అనే విషయంపై శంకర్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి ఒకరిపై ఒకరు చెప్పుకొంటుండటంతో పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. మూడు నెలలుగా అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నందుకు విజయభాస్కరరెడ్డిపై కేసు నమోదు చేశారు. మరోవైపు 2004 నుంచి ఆయుధం కలిగి ఉన్నాడని ఝాన్సీ చెప్పడం, ఆమెను హత్య చేయాలని విజయభాస్కరరెడ్డిని పురమాయించడంతో శంకర్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. భర్త లేని ఒంటరి మహిళలే టార్గెట్... భూములు, భవనాలు, ఇతర ఆస్తులు ఉండి భర్త చనిపోయిన ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని పదేళ్లుగా ఈ ముఠా దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుని మంచిగా వారికి దగ్గర కావడం, కొంత డబ్బు ఇచ్చి ఆస్తులు రాయించుకోవడం వీరికి పరిపాటిగా మారింది. అనంతరం వారిని శారీరకంగా లొంగదీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వీరికి అలవాటుగా మారింది. జిల్లాకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి వారిని బుట్టలో వేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల రాసలీలలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ తమ పనులు చక్కబెట్టుకున్నట్టు తెలిసింది. ఇలా అనేక మంది మహిళలను మోసగించి నగరంలో ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులను కాజేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉండటంతో అసలు విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుపాకీ సైతం పోలీస్ అధికారుల అండతోనే వీరి వద్దకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో చీకటి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లు సమాచారం. తుపాకీ విషయం తేలకపోవటంతో.. పోలీసులు మరోసారి శంకర్‌రెడ్డి, విజయభాస్కరెడ్డిలను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా విచారణ జరిపితే పెద్దల చీకటి బాగోతాలు బయటపడే అవకాశాలున్నాయి. -
ఆర్అండ్బీ డీఈ ఇంటిపై ఏసీబీ దాడులు
కర్నూలు: కర్నూలు రోడ్లు, భవనాల శాఖ డీఈ శంకర్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులకు దిగారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో కర్నూలులోని జోహార పురం రోడ్డులో నేహ అపార్ట్మెంట్స్లోని శంకర్‌రెడ్డి ఫ్లాట్‌లో సోదాలు చేపట్టారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయన స్నేహితుల ఫ్లాట్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. -
లంచం అడుగుతున్నారా .. కాల్ 1064
టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన ఏసీజీ గోప్యంగా ఫిర్యాదుదారుల వివరాలు తప్పు చేస్తే ఇంటిదొంగకైనా చర్యలు టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగాహన కల్పిస్తాం ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద టోల్‌ఫ్రీనెంబర్ 1064 పోస్టర్ అంటిస్తాం. అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. బాధితులు ఎంత పెద్దవారిపైన అయినా టోల్‌ఫ్రీ నంబర్‌కు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా వుంచుతాం. ఏసీబీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎసీబీ డీఎస్పీ నంబర్ 9440446190, సీఐలు 9440446138, 9440808112 నంబర్లకు కాల్ చేయవచ్చు. 1064కు కాల్ చేస్తే మీ ప్రతి ఒక్క మాటను రికార్డు అవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లంచగొండి ఉద్యోగి భరతం పడుతాం. - శంకర్‌రెడ్డి, ఏసీబీ డీఎస్పీ, తిరుపతి తిరుపతి క్రైం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీపని చేసిపెట్టేందుకు లంచం అడుగుతున్నారా? దీనిపై స్థానిక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదా? ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల వివరాలు మీవద్ద ఉన్నాయా ? వీటన్నింటిపై ఫిర్యాదు చేసేందు కు అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ కేంద్రంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ అధికారులు ఫిర్యాదు అందుకున్న వెంటనే కిందిస్థాయి సిబ్బందికి సమాచారం అందించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు దారుల వివరాలు అత్యంత గోప్యంగా వుంచుతారు. అవినీతిని అరికట్టాల్సిందే ... ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పథకాల ఎంపికలో దళారులు, రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి.ఏ అధికారిఅయినా డిమాండ్ చేస్తే నిలదీయాలి. లేదా ఏసీబీని ఆశ్రయించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక నిఘా ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రజలు కూడా ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల వివరాలను పూర్తిస్థాయిలో అందించాలి.ఏసీబీ, విజిలెన్స్ శాఖల్లో అవసరమైన సిబ్బందిని నియమిస్తే నిరంతరం తనిఖీలు చేసే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్న విభాగాలివే.. పౌరసరఫరాలశాఖలో కొందరు అధికారులు మా మూళ్ల మత్తులో జోగుతున్నారు. తూనికలు, కొలత ల్లో మోసం జరుగుతున్నా పట్టించుకునే ఉన్నతాధికారులే కరువయ్యారు. చౌక దుకాణాల్లో వినియోగదారుడికి సరుకులు సక్రమంగా అందడంలేదు. రెవెన్యూ విభాగంలో ఆర్డీవో కార్యాలయం మొదలు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు, కుల, ఆదా య ధ్రువీకరణపత్రాల్లో అవినీతి పేరుకుపోయింది. ఈ విభాగాల్లో ఎక్కువ మంది ఏసీబీకి పట్టుపడడం గమనార్హం. ప్రజలతో పూర్తిగా సత్సంబంధాలు కలిగే ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. సంక్షేమవసతి గృహాల్లో కొంతమంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే మెనూలోనూ నిబంధనలు పాటించకుండా జేబులు నింపుకుంటున్నారు. పోలీసు శాఖలో కూడా అవినీతి పెచ్చుమీరిపోయింది. హోంగార్డు నుంచి అధికారి వరకు లంచం లేనిదే ఏపనీ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఈ విభాగంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచకపోవడంతో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. ప్రజలు కూడా ఈవిభాగంపై ఫిర్యాదు చేయడంలేదు. పురపాలక శాఖలో కూడా అవినీతి పెచ్చు మీరిపోయింది. కొళాయి పన్ను నుంచి భవన నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసేంత వరకు మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లలో ఏసీబీ కేసులివే.. 2012 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఒకటి, తదితర దాడుల కేసులు 4, ట్రాపింగ్ కేసులు తొమ్మిది నమోదయ్యాయి.2013లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ట్రాపింగ్ కేసులు 13, ఇతర రత్రా దాడుల్లో 5 కేసులు నమోదయ్యాయి. 2014లో ఆదాయానికి మించిన కేసు ఒకటి, ట్రాపింగ్ కేసులు 19, ఇతరత్రా దాడుల్లో 10 కేసులు నమోదయ్యాయి. -
పేద రైతు కొడుకు స్టేట్ ఫస్ట్
తిరుచానూరు : ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాల్లో పేద రైతు కొడుకు... రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామానికి చెందిన నల్లపూసల శంకర్‌రెడ్డి, ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 తెచ్చుకుని, స్టేట్ ఫస్ట్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి శంకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తపరిచాడు. -
ఎసీబీ వలలో వెదురుకుప్పం ఆర్ఐ
వెదురుకుప్పం: వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్ర గురువారం మధ్యాహ్నం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి కథనం మేరకు మండలంలోని దామరకుప్పం గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలు పోగొట్టుకున్నాడు. రామచంద్రారెడ్డి కుమారుడు అత్తూరు రాజేంద్రరెడ్డి ఈ మేరకు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారించి పాసుపుస్తకాలు బస్సులో పోగొట్టుకున్నట్లు నిర్ధారించారు. పాసు పుస్తకాల జిరాక్సు కాపీలతో పాటు పోలీసులు ఇచ్చిన సర్టిఫికెట్తో వెదురుకుప్పం తహసీల్దార్ ఇంద్రసేనకు డూప్లికెట్ పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. దీంతో తహసీల్దార్ కింది స్థాయి సిబ్బందికి సంబంధిత ఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫైల్ సిద్ధం చేయడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఏవో కుంటిసాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తూ రాజేంద్రరెడ్డిని వేధించాడు. దీంతో విసిగి వేసారిపోయిన రాజేంద్రరెడ్డి తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు రాజేంద్రరెడ్డికి డబ్బులు ఇచ్చి ఆర్‌ఐకు ఇవ్వాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆర్ఐ చంద్రకు రూ.3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో సీఐలు రామకిషోర్,చంద్రశేఖర్‌రెడ్డి,లక్ష్మీకాంత్‌రెడ్డి,సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో అధికారులు అవినీతికి పాల్పడినా,డబ్బులు డిమాండ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నా సెల్ ః9440446190, 9440446120,9440446138, 9440446193,9440808112 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శంకర్‌రెడ్డి కోరారు. రెవిన్యూ అధికారుల్లో గబులు వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజులుగా సిబ్బంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ నాయకులు కూడా ఈ విషయూన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆర్ఐను పట్టుకోవడంతో సిబ్బందిలో గుబులు పట్టుకుంది. కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలియడంతో వీఆర్వోలు పత్తా లేకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన సిబ్బందిలో నెలకొంది. -
ఏసీబీ వలలో పెద్దచేప
పట్టుబడ్డ యుఎల్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అధికారితో పాటు అతని కుమారుడూ కటకటాలపాలు అవినీతి కూపంలో యుఎల్‌సీ కార్యాలయం అబిడ్స్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సీ)లో విధులు నిర్వర్తించే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తానే లంచావతారం ఎత్తి తన కొడుకుతో డబ్బులు తీసుకున్న ఆ అధికారి తన కొడుకుతో సహా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్‌నగర్ మండలంలోని నర్సింహాపురి కాలనీలో రెండు ప్లాట్లు రెగ్యులరైజ్ చేసేందుకు అదే ప్రాంతంలో ఉండే తుమ్మలపల్లి బాల్‌రెడ్డి 2005లో నాంపల్లిలోని యుఎల్‌సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అతనికి రెగ్యులరైజేషన్ డబ్బులు కట్టినప్పటికీ తన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయలేదు. ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్రావు రెగ్యులరైజ్ చేస్తానంటూ అందుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాల్‌రెడ్డి వెంకటేశ్వర్రావుతో ముందుగా రూ.50వేలు ఇస్తానని, మిగతా మొత్తం తర్వాత ఇవ్వనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు బాల్‌రెడ్డి ఫిర్యాదును స్వీకరించి శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర్రావుకు రూ.50వేలు ఇవ్వాలని సూచించారు. కాగా సాయంత్రం 6 సమయంలో వెంకటేశ్వర్రావు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా తన కొడుకు అమర్దాస్కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. డబ్బులు అమర్దాస్ తీసుకుని వెంకటేశ్వర్రావు తీసుకున్న కొద్ది సేపటికే ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నిరంజన్, నాయుడు, అంజిరెడ్డిల బృందం వెళ్లింది. వారిని పసిగట్టిన వెంకటేశ్వర్రావు తీసుకున్న డబ్బులను సమీపంలో ఉన్న డ్రమ్‌లో పడేశాడు. ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని డ్రమ్ములో ఉన్న నగదును స్వాధీనపర్చుకున్నారు. తండ్రీ కొడుకులను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అవినీతి కూపంలో యుఎల్‌సీ... ఎంజెమార్కెట్-నాంపల్లి ప్రధాన రహదారిలో ఉన్న రాష్ట్ర యుఎల్‌సీ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. నాలుగు నెలల క్రితమే ఓ ఉన్నతాధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడగా తిరిగి శుక్రవారం సాయంత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదిగా చంద్రవిహార్ భవనంలోని 3వ అంతస్తులో గల యుఎల్‌సీ కార్యాలయం పూర్తిగా అవినీతి నిలయంగా మారింది. నగరంతో పాటు శివారు ప్రాంతాలైన మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాలకు చెందిన వేల ఎకరాల భూమికి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్ కోసం ప్రజలు తరలివస్తారు. శివారు ప్రాంతాల్లోని కొన్ని మండలాలలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్‌కు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ యుఎల్‌సీ క్లియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేయండి: డీఎస్పీ శంకర్‌రెడ్డి యుఎల్‌సీ కార్యాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనుల కోసం లంచాలు అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి సూచించారు. కొంత మంది ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో తమకు సమాచారం రావడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు ధైర్యంగా లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేస్తే ఏసీబీ ఆయా అధికారులను కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. ఫిర్యాదుల కోసం 9440446134 ఫోన్ నెంబర్లో సంప్రదించాలన్నారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : విద్యుదాఘాతంతో మండల పరిధిలోని అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతిచెందాడంటూ పరిశ్రమకు చెందిన ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ శంకర్‌రెడ్డి కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం (ఓడీఎఫ్) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో నివాసం ఉండే యూనస్ (25) 15 రోజుల క్రితమే పరిశ్రమలో వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే మంగళవారం ఉదయం జనరల్ షిఫ్ట్‌కు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా అబిటాస్ సెక్షన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే యాజమాన్యం మాత్రం యూన స్ మృతి చెందలేదని కొన ఊపిరితో ఉన్నాడని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతుడిని తిరిగి పరిశ్రమ వద్దకు తె చ్చారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యూనస్ మృతి చెందాడని ఆందోళనకు దిగారు. అంతటితో ఆగక పరిశ్రమకు చెందిన కార్యాలయం కిటికీ అద్దాలు పగుల గొట్టారు. ఫర్నీచర్ , కంప్యూటర్లు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న సీఐ శంకర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు హుఠాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని అ దుపు చేశారు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అయితే రూ. 7 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో ఆందోళనకారులు వెనుతిరిగారు. -
సైబరాబాద్ కమిషనర్ ఆనంద్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
హైదరాబాద్: సైబరాబాద్ సీపీ ఆనంద్ తన భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ నేత శంకర్ రెడ్డి హెచ్ఆర్సీసీని ఆశ్రయించారు. తనకున్న ఐదెకరాల భూమిని బంధువులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ డీజీపీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 6లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సోమవారం సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆనంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కమల కుమారి అనే మహిళ కోర్టుకు తెలిపారు. కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.సీవీ ఆనంద్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరయ్యేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు. -
4 నెలల తర్వాత స్వగ్రామానికి మృతదేహం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సత్తి శంకర్ రెడ్డి భౌతికకాయం గురువారం ఉదయం గ్రామం చేరుకుంది. ఈ ఏడాది జూన్ 18న సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (కారు ఎక్సిడెంట్) శంకర్ రెడ్డి మృతి చెందాడు. మృతదేహాన్ని పంపాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సూచించడంతో ఆర్థికస్తోమత లేక ఎదురుచూశారు. ఇదిలావుండగా ఆగస్టు 1న మృతుడు శంకర్‌రెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి తాడేపల్లిగూడెంకు చెందిన సంఘ సేవకులు, కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించి తన తండ్రి భౌతికకాయాన్ని రప్పించి కడసారి చూపును ప్రసాదించాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన ఆయన ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సహకారంతో ఇండియా, సౌదీ రాయబారి కార్యాలయాలను సంప్రదించారు. ఎటువంటి సొమ్ములు చెల్లించకుండా ఎట్టకేలకు మృతదేహాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించేందుకు సౌదీ అధికారులు అంగీకరించారు. నాలుగు నెలల అనంతరం మృతదేహం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. మాణిక్యాలరావు విజ్ఞప్తి మేరకు వాయిస్ ఆఫ్ ఇండియా ఎమిగ్రెన్సీ ద్వారా ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం మీదుగా మంచిలి చేర్చారు. గురువారం ఉదయం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌కు అంబులెన్స్ చేరుకోగా గట్టిం మాణిక్యాలరావు శవపేటికను పరిశీలించి మృతుని కుమారుడు రామకృష్ణారెడ్డికి సంతాపం తెలిపారు. సౌదీ నుంచి రావాల్సిన బీమా సొమ్ము ను కూడా రప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కుటుంబ సభ్యులు తమను సంప్రదించాలని సూచించారు. సెల్ నెంబర్ : 94906 76699లో విజ్ఞప్తి చేయూలని కోరారు. తన తండ్రి మృతదేహాన్ని ఇండియూకు రప్పించేందుకు కృషి చేసిన వారికి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.