
సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎత్తిపోతల పథకాలపై సమగ్ర అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఆర్మూర్, నిజామాబాద్, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని కొత్త ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.250 కోట్ల అంచనాలకు త్వరగా అనుమతులు పొందాలన్నారు. గురువారం ఐడీసీ ఎండీగా శ్యామ్‌సుందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్‌రెడ్డి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో స్థానిక రైతులను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు.