సాక్షి, హైదరాబాద్: ఓ పక్క బృహత్తర ప్రాజెక్టులు చేపడుతూనే మరోపక్క చిన్న ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి చెప్పా రు. తెలంగాణ ఎగుడు దిగుడు ప్రాంతమవడం.. గోదావరి, కృష్ణా నదులు తక్కు వ ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఎక్కువ శాతం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడా ల్సి వస్తోందన్నారు.
సోమవారం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయం లో అధికారులతో మంత్రి జోగురామన్న, ఈద శంకర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం లో కోటి ఎకరాలకు నీరు అందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి.. వాటి ఉపనదులపై 582 ఎత్తిపోతల పథకాలుం డగా, ప్రస్తుతం 82 పథకాలపై దృష్టి సారించామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టులపై చర్చించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment