Irrigation Development Corporation
-
తెరపైకి సాగునీటి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నీటి పారుదల వ్యవస్థ యాజమాన్యంలో రైతులకు భాగస్వామ్యం కల్పించే చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం, వాటి కింద నిర్మిస్తున్న కాల్వల ద్వారా సాగునీటిని అందిస్తున్న పరిస్థితుల్లో నీటి పారుదల వ్యవస్థ సక్రమ నిర్వహణ, సమర్ధ నీటి పంపిణీకి సాగునీటి సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థల సమగ్ర అభివృధ్ధికి వీలుగా ఈ సంఘాలకు గతంలోమాదిరి ఎన్నికలు నిర్వహించడమా లేక గ్రామ కమిటీలను నియమించడమా లేక లాటరీ పద్ధతిన ఉత్సాహవంతులను ఎంపికచేయడమా? అన్న అంశాలను పరిశీలిస్తోంది. 2014 వరకే పనిచేసిన సంఘాలు.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వినియోగదారులను సంఘటిత పరచడం, నీటి యాజమాన్యంలో రైతులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా 1997లో అప్పటి ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది. సాగునీటి వినియోగ సంఘాలు (డబ్ల్యూయూఏ), డిస్ట్రిబ్యూటరీ సంఘాలు(డీసీ), ప్రాజెక్టు కమిటీ(పీసీ)లను ఏర్పాటు చేసింది. 2014కు ముందు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మేజర్ ప్రాజెక్టుల కింద నీటి వినియోగ సంఘాలు 744, డీసీలు 97, పీసీలు 8 వరకు ఉండేవి. ఇక మైనర్ కింద 3,876 వరకు నీటి సంఘాలు ఉండేవి. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటి ఎన్నికల్లో మార్పులు చేసింది. రొటేషన్‌లో ఈ సంఘాల కార్యవర్గాలు పనిచేసేలా చర్యలు తీసుకుంది. ప్రతి రెండేళ్లకోమారు మూడో వంతు సభ్యులకు ఎన్నికలు జరిపి రెండేళ్ల పదవీకాలం ముగిసే సభ్యులను మాజీలు చేయాలని సూచించింది. ఈ పద్ధతిలో 2006, 2008 సంవత్సరాల్లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంఘాలే 2014 జనవరి వరకు ఉన్నా, తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం రైతు సంఘాల జోలికి వెళ్లలేదు. -
కొత్త ‘ఎత్తిపోతల’ అంచనాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎత్తిపోతల పథకాలపై సమగ్ర అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్, నిజామాబాద్, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని కొత్త ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.250 కోట్ల అంచనాలకు త్వరగా అనుమతులు పొందాలన్నారు. గురువారం ఐడీసీ ఎండీగా శ్యామ్‌సుందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్‌రెడ్డి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో స్థానిక రైతులను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. -
ఎత్తిపోతలే ఆధారం
సాక్షి, హైదరాబాద్: ఓ పక్క బృహత్తర ప్రాజెక్టులు చేపడుతూనే మరోపక్క చిన్న ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి చెప్పా రు. తెలంగాణ ఎగుడు దిగుడు ప్రాంతమవడం.. గోదావరి, కృష్ణా నదులు తక్కు వ ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఎక్కువ శాతం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడా ల్సి వస్తోందన్నారు. సోమవారం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం లో అధికారులతో మంత్రి జోగురామన్న, ఈద శంకర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం లో కోటి ఎకరాలకు నీరు అందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి.. వాటి ఉపనదులపై 582 ఎత్తిపోతల పథకాలుం డగా, ప్రస్తుతం 82 పథకాలపై దృష్టి సారించామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టులపై చర్చించామని చెప్పారు. -
ఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈద
- హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హైదరాబాద్: ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్(ఐడీసీ) ఛైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ ఐడీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావుతో పాటు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, మనోహర్‌రెడ్డి, సతీష్‌కుమార్, శోభ, ఇతర నేతలు హాజరయ్యారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు శంకర్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుముచిత స్ధానం కల్పిస్తున్నారని తెలిపారు. శంకర్‌రెడ్డి తొలినుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని, ఆయన్ను ఐడీసీ ఛైర్మన్‌గా నియమించి నీటి పారుదల శాఖకు కేసీఆర్ మరింత బలోపేతం చేశారన్నారు. కాంగ్రెస్ హాయంలో ఎత్తిపోతల పథకాలన్నీ మూలనపడ్డాయని, ప్రస్తుతం వాటన్నింటినీ పునరుధ్దరించిన చివరి ఆయకట్టుకు నీరందించాల్సిన బాధ్యత ఐడీసీపై ఉందన్నారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ఎత్తిపోతల పథకాలన్నింటినీ సమర్ధంగా పనిచేసేలా శంకర్‌రెడ్డి కృషి చేస్తారనే నమ్మకం తనకుందని తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని, వారికి ఎప్పుడూ సుముచిత గౌరవం దక్కుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి శంకర్‌రెడ్డి కృషి చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.