పాశం శ్రీను అదృశ్యంపై హెచ్చార్సీలో ఫిర్యాదు | complaint filed in HRC ovar pasham srinu missing | Sakshi

పాశం శ్రీను అదృశ్యంపై హెచ్చార్సీలో ఫిర్యాదు

Jun 29 2016 3:29 PM | Updated on Sep 4 2017 3:43 AM

మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకుడు పాశం శ్రీను అదృశ్యంపై ఆయన భార్య నళిని బుధవారం హెచ్చార్సీని ఆశ్రయించింది.

హైదరాబాద్‌: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకుడు పాశం శ్రీను అదృశ్యంపై ఆయన భార్య నళిని బుధవారం హెచ్చార్సీని ఆశ్రయించింది. పాశం శ్రీనుపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో భువనగిరి డీఎస్పీ, సీఐ, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, విరసం నేత వరవరరావులపై శ్రీను కుటుంబసభ్యులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కలగజేసుకుని తన భర్త ఆచూకీ తెలపాలని నళిని కోరింది.

కాగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో శ్రీను మృతిచెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా, స్థానిక ఆస్పత్రికి ఆదివారం గుండెపోటుతో పాశం శ్రీను అనే వ్యక్తి వచ్చాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో వేరే ఆస్పత్రికి పంపించినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న పాశం శ్రీను మృతిపై ఎటువంటి సమాచారం లేదని భువనగిరి పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement